రంకెలేస్తున్న బుల్… సెన్సెక్స్ @ 32
- 14 Views
- admin
- July 13, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: దిగొచ్చిన ద్రవ్యోల్బణంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలకు తోడు, విదేశీ మార్కెట్లలో జోరు కొనసాగుతుండటంతో, భారత ట్రేడింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీలు ఎగబాకాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే బొంబాయి స్టాక్ ఎక్సేóంజ్ సూచిక సెన్సెక్స్ 32 వేల పాయింట్ల మైలురాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేó్చంజ్ నిఫ్టీ 9,900 పాయింట్లను తాకింది. జూన్ నెల రిటైల్ ఇన్ ఫ్లేషన్ గణాంకాలు నిన్న విడుదల కాగా, 1.54 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం 10.05 గంటల సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 32,035 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 9,881 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ భారీ లాభాలను అందుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఎస్ బ్యాంక్, ఐటీసీ తదితర కంపెనీలు లాభాలను పండించుకోగా, ఇన్ ఫ్రాటెల్, ఐఓసీ, ఓఎన్జీసీ తదితర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 32,017, నిఫ్టీ 9,876 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.46 వద్ద కొనసాగుతోంది.


