ఆయన జీవితం ఆదర్శనీయం… ఘనంగా మొదటి పార్లమంటేరియన్ తిలక్ జన్మదిన వేడుకలు
- 24 Views
- admin
- July 15, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
మొదటి పార్లమెంట్ సభ్యుడు కందాళం సుబ్రహ్మణ్య తిలక్ 98వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అక్కయ్యపాలెంలోని ఆయన స్వగ్రుహంలో పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు శక్తి అసోషియేషన్ అధ్యక్షుడు బీవీ రామ్ ఆధ్వర్యంలో కేక్‌ను ఏర్పాటు చేశారు. మొదటి పార్లమంటేరియన్ తిలక్ చేతుల మీదుగా కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ విప్ ద్రోణం రాజు శ్రీనివాస్, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఫ్రొఫెసరు జీఎస్ఎన్ రాజు, ఫ్రొఫెసరు మోహన్ దాస్, ఫీచర్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ భరణికాన రామారావు, ఎయిర్ ట్రావెలర్స్ అసోషియేషన్ అద్యక్షులు వరదారెడ్డి, సీపీఐ నాయకులు పైడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ విప్ ద్రోణం రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ తిలక్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. సమాజం పట్ల బాధ్యత, నిజాయితీ, భక్తి మార్గం ఆయనను ఇంత కాలం జీవించేలా చేశాయన్నారు.
సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఫ్రొపెసరు జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సంపాదన పేరిట ఒత్తిడికి గురై అనారోగ్యానికి పాలయ్యే నేటి తరం తిలక్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనవసరపు ఒత్తిడి లేని ఆయన లాంటి జీవితాన్ని మనం అనుసరించాలని సూచించారు.
ఫీచర్స్ ఇండియా చీప్ ఎడిటర్ భరణికాన రామారావు మాట్లాడుతూ ఆ రోజుల్లో సమాజం కూడా నిజాయితీ గల నాయకత్వం వెంట ఉండేదన్నారు. ఈ నాటి రాజకీయాలు భిన్నంగా మారిన దశలో పార్లమంటేరియన్ తిలక్ జీవితాన్ని మనం అనుసరించాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిజాయితీ నాయకుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం అద్రుష్టంగా ఆయన పేర్కొన్నారు.
సీపీఐ నాయకులు పైడిరాజు మాట్లాడుతూ అవినీతి మరకలు లేని జీవితమే తిలక్ ను 98 సంవత్సరాలు జీవించాలా చేసిందని అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు అనవసర ఆదాయాలకు అలవాటు పడి పరిమిత కాలంలోనే జీవితాలను ముగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అద్యక్షుడు వరదా రెడ్డి, తెలుగు శక్తి వ్యవస్ధపకులు బీవీ రాం మాట్లాడారు. అవినీతి మయమైన నేటి రాజకీయ నాయకుల్లో మార్పు అవసరమన్నారు. దీనికి సమాజం కూడా సహకరించాలని కోరారు. తిలక్ పుట్టిన రోజు వేడుకల్లో బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. హారతీ ఇచ్చి నూరేళ్లకు పైగా జీవించాలని భగవంతుడ్ని ప్రార్థించారు.
.. ఫోటో…..తొలి పార్లమంటేరియన్ తిలక్ జన్మ దిన వేడుకల్లో పాల్గొన్న మాజీ విప్ ద్రోణం రాజు శ్రీనివాస్, సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఫ్రొఫెసరు జీఎస్ఎన్ రాజు, ఫీచర్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ భరణికాన రామారావు తదితరులు.


