మలయాళం సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల జాబితాలో దిలీప్ తొలి మూడు స్థానాల్లో ఉంటాడు. మమ్ముట్టి, మోహన్ లాల్ వాటి వారితరువాత అగ్ర పీఠం దిలీప్ దే. దిలీప్ కు కేవలం సినిమాలేకాదు..రియల్ ఎస్టేట్ మరియు వివిధ వ్యాపారాలలో రాణిస్తున్నాడు. ఎలాంటి సమస్యలు లేని దిలీప్ నటి భావన పై ఎందుకు పగ పెంచుకున్నాడు ? దిలీప్, దిలీప్ భావన మధ్య ఏదైనా గొడవ జరిగిందా ? అసలు ఈ కేసులో దిలీప్ ఎలా ఇరుక్కున్నాడు ? తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
తన జీవితంలో చిక్కులు తీసుకునివచ్చిందని దిలీప్ భావన పై పగతో రగిలిపోయాడు. ఆమెపై ఎలాగైనా కక్ష సాధించాలని నిశ్చయించుకున్నాడు. దీనితో బేరం కుదుర్చుకున్న గ్యాంగ్ ని ఆమెపైకి ఉసిగొల్పాడు. గత ఫిబ్రవరిలో భావన కారులో కొచ్చి ప్రయాణిస్తుండగా పల్సర్ సుని గ్యాంగ్ లోని ఏడుగురు ఆమె వాహాన్ని ఢీకొట్టారు. దీనితో భావనకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెని బలవంతంగా కారులో కిడ్నప్ చేసిన ఆ గ్యాంగ్ దూరంగా తెలుస్కుని వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆమెని లైంగికంగా వేధించారు. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీసిన పల్సర్ సుని గ్యాంగ్ వేరే టెంపోలో పారిపోయారు. భయానికి గురై ఉన్న నటి దగ్గర్లోని ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన లాల్ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తెలిపింది. అతడితో కలసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో భావన ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మొదలైన ఈ కేసు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న దిలీప్ అరెస్ట్ వరకు వెళ్ళింది.
భావన పై దిలీప్ కక్ష్య పెంచుకోవడానికి బలమైన కారణాన్ని మలయాళీ చిత్ర పరిశ్రమ వివరిస్తోంది. వారి మధ్య గొడవకు 2013 లో బీజం పడినట్లు తెలుస్తోంది. దిలీప్ భార్య మంజు వారియర్ కు భావన సన్నిహితురాలు. దిలీప్ కు ఆ సమయంలో నటి కావ్య మాధవన్ కు మధ్య ప్రేమాయణం నడిచేది. దీని గురుంచి భావన మంజు వారియర్ కి తెలియజేసింది. తన భర్త వేరే మహిళతో సంభందం కొనసాగిస్తున్నాడని తెలియగానే అందరు మహిళలాగే మంజు కూడా దిలీప్ ని చీదరించుకుంది. తన కాపురంలో వివాదాలు సృష్టించిందని భావనతో దిలీప్ అప్పట్లో గొడవ పడ్డాడు. 1998 లో వివాహం చేసుకున్న దిలీప్, మంజుల జంట 2014 లో విడిపోయింది. తన వివాహ భాండం లో సమస్యలు రాడానికి భావన కారణం అని పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భావనపై లైంగిక దాడి కుట్రకు ప్లాన్ చేసి ఉంటాడని మలయాళీ చిత్ర పరిశ్రమ లో చర్చ జరుగుతోంది. భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో 2016 లో దిలీప్.. నటి కావ్య మాధవన్ ని వివాహం చేసుకున్నాడు.
తన సహా నటుడు వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న పల్సర్ సుని ఓ చిల్లర నేరగాడు అని దిలీప్ తెలుసుకున్నాడు. తన పగని నెరవేర్చడానికి ఇతడే సరైన వ్యక్తి అని నమ్మిన దిలీప్ అతడిని సంప్రదించాడు. పక్కా ప్లాన్ తో భావన పై లైంగిక దాడి చేసి ఆమె వీడియోలో తీస్తే రూ 2 కోట్ల వరకు ఇస్తానని వారి మధ్య బేరం జరిగింది. ఆ తరువాత అవి మార్ఫింగ్ వీడియోలని ఆమె చెప్పుకోవడానికి వీలులేకుండా స్పష్టంగా క్లోజప్ లో తీయాలని దిలీప్ చెప్పాడట. చెప్పినట్లుగా నే పల్సర్ సుని పని పూర్తి చేశాడు. ఇంతా తెలివిగా పక్కాగా స్కెచ్ గీసినా దిలీప్ దొరికి పోవడానికి కారణం అతడు చేసిన చిన్న పొరపాటే. ఎంత తెలివైన వాడైనా పొరపాటు చేయక మానడు. అదే దిలీప్ విషయంలో కూడా జరిగింది.
భావనపై లైంగిక దాడి జరిగిందనే విషయం తనకు మరుసటి రోజు ఉందయం తెలిసిందని, చాలా దిగ్బ్రాంతికి గురయ్యానని దిలీప్ తెలిపాడు. తనకు నిర్మాత ఫోన్ చేసి చెబితేనే ఈ విషయం తెలిసిందని చెప్పి దిలీప్ పప్పులో కాలేశాడు. అంతటి బాధాకరమైన వార్త తొలిసారి తెలుసుకునేటప్పుడు కేవలం 12 సెకండ్లు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేయరు. కానీ దిలీప్ సదరు నిర్మాతతో మాట్లాడింది కేవలం 12 సెకండ్లే. దీనితో దిలీప్ పై పోలీస్ లకు అనుమానం పెరిగింది. దిలీప్ ని పోలీస్ లు ఓ కంట కనిపెడుతున్న సమయంలో ఓ అభిమాని తీసిన ఫోటో వైరల్గా మారింది. అందులో దిలీప్ వెనుకాల పల్సర్ సుని ఉన్నాడు. అపప్టి వరకు తనకు పల్సర్ సుని ఎవరో తెలియదని దిలీప్ బుకాయించాడు. అరెస్టైన పల్సర్ సుని తనకు రావాల్సిన డబ్బు ఇకనైనా ఇవ్వాలని దిలీప్ కు జైలు నుంచే ఉత్తరం రాసాడు. ఇలా ఉత్తరాలు రాసి పల్సర్ సుని తనని బెదిరిస్తున్నాడని తనకు తానుగా దిలీప్ ఆ ఉత్తరాన్ని బయట పెట్టాడు. దీనితో దిలీప్ పై పోలీస్ లు నిఘా పెంచారు. దిలీప్ ప్రముఖులతో మాట్లాడేందుకు రహస్య ఫోన్ నెంబర్ ని వాడుతున్నట్లు పోలీస్ లు పసిగట్టారు. ఇలా దిలీప్ తనకు తానుగా ఈ కేసులో ఇరుక్కుపోయాడు.
గోపాల కృష్ణన్ పద్మనాభన్ పిళ్ళై అనేది దిలీప్ అసలు పేరు. ఇది చాలా మందికి తెలియని విషయం. అంతెందుకు తాన అసలు పేరుని తానే కొన్ని సందర్భాల్లో మరచిపోతుంటానని దిలీప్ స్వయంగా చెబుతుంటాడు. మలయాళ సినీ అభిమానులు దిలీప్ ని ముద్దగా జనప్రియ నాయకన్ అని పిలుచుకుంటారు. ఆ జనప్రియ నాయకన్ ఇప్పుడు అందరికి అప్రియం గా మారిపోయాడు. 23 ఏళ్ల క్రితం దిలీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘మన్నాదే కొట్టారం’. ఆ చిత్రం లో హీరో పాత్ర పేరు దిలీప్. అప్పటి నుంచి అదే అతడి పేరుగా మారిపోయింది. 1990 లో మలయాళీ చిత్ర పరిశ్రమలో దిలీప్ పాపులారిటీ బాగా పెరిగింది. కుటుంబ కథ చిత్రాలు ప్రేమ కథా చిత్రాల ద్వారా ఫ్యామిలి ఆడియన్స్ కి దిలీప్ దగ్గరయ్యాడు. దిలీప్ కి కేవలం నటనే కాదు నిర్మాతగా, వ్యాపార వేత్త గా కూడా రాణించాడు. తనకు ఎదురువచ్చినా వారిని అణచి వేస్తాడనే అపవాదు దిలీప్ కు ఉంది. ప్రముఖ దర్శకుడు వినయన్ కు అవకాశాలు లేకుండా చేసి అతడి కెరీర్ నాశనం చేసింది దిలీప్ అని మలయాళీ చిత్ర పరిశ్రమలో టాక్. మరో సీనియర్ నటుడు తిలకన్ ని కూడా చివరి రోజుల్లో దిలీప్ వేధించారని అంటారు. చిత్ర పరిశ్రమలో తన పాపులారిటీని పెంచుకున్న దిలీప్ చివరకు జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి రానే వచ్చిందని అంత ఓ అభిప్రాయానికి వచ్చేసారు.