మహిళల వన్డే ప్రపంచ కప్: 186 పరుగులతో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
- 13 Views
- admin
- July 15, 2017
- Home Slider అంతర్జాతీయం ఆటలు జాతీయం తాజా వార్తలు
ప్రపంచకప్ సెమీస్‌కు భారత్
డెర్బీ: మిథాలీ సేన మిలమిల మెరిసింది. అదుÄతే గెలుపుతో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌కు చేరింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సూార్తిేదాయక విజయంతో ప్రపంచకప్ కల నెరవేర్చుకొనేందుకు సిద్ధమైంది. తొలుత మిథాలీ రాజ్ (109బీ 123 బంతుల్లో 11ఐ4), వేద క ష?మూర్తి (70బీ 45 బంతుల్లో 7ఐ4, 2ఐ6), హర్మన్‌ప్రీత్ (60బీ 90 బంతుల్లో 7ఐ4) అదుÄతే బ్యాటింగ్‌తో భారత్ 265/7 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 25.3 ఓవర్లకు 75 పరుగులకే చేతులెత్తేసింది. అమి షట్టర్త్వెయిట్ (26) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ (5/15), దీప్తి శర్మ (2/26) కివీస్ బ్యాట్స్‌వుమెన్స్ నడ్డి విరిచారు. జులన్, శిఖ, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.
కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పూనమ్ రౌత్ (4), స్మ తి మందాన (13బీ 24 బంతుల్లో 2ఐ4) జట్టు స్కోరు 21 పరుగుల వద్దే పెవిలియన్ చేరుకున్నారు. పూనమ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సారథి మిథాలీ రాజ్ (109) హర్మన్ ప్రీత్ (60)తో కలిసి చక్కని భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. తన ఇన్నింగ్స్‌లో మిథాలీ ఎక్కడా తొందర పడలేదు. అనవసర షాట్లకు ప్రయత్నించలేదు. తొలుత ఆచితూచి ఆడుతూ అర్ధశతకం సాధించింది. క్రమంగా జోరు పెంచి వన్డేల్లో ఆరో, ప్రపంచకప్ టోర్నీల్లో రెండో శతకం నమోదు చేసింది. ఆమెకు అర్ధశతకంతో హర్మన్‌ప్రీత్ సహకారం అందించింది. ఐతే జట్టు స్కోరు 153 వద్ద కస్‌పెరిక్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చింది. ఆ తర్వాత పరుగు తేడాతోనే దీప్తి శర్మ(0) పెవిలియన్ చేరింది.
సుష్మ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వేద క ష?మూర్తి (70) చెలరేగి ఆడింది. తన బ్యాటింగ్ మెరుపులు చూపించింది. తొలుత నిలకడగా ఆడిన ఆమె చివరి పది ఓవర్లలో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడింది. ఆమె క్రీజు దాటి ముందుకొచ్చి బాదిన షాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. మరో పక్క మిథాలీ శతకం బాదడంతో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. వేద మెరుపులకు 46వ ఓవర్లో 16, 47వ ఓవర్లో 17 మొత్తం 33 పరుగులు వచ్చేశాయి. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ అత్యధిక పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్లో 3 వికెట్లు పోయినా అప్పటికే భారత్ పోరాడగలిగే స్కోర్ చేసింది.


