సమగ్ర విద్యతోనే సమాజాభివృద్ధి
- 6 Views
- admin
- July 17, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
వృత్తి నైపుణ్యాలు ఉపాథికి ప్రయోజనాల – ఒత్తిడిలేని చదువులు జీవిత సోపానాలు
సెంచురియన్ ఉపకులపతి ప్రొ||డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఆనందం.. ఆప్యాయత.. ఆదరించే స్వభావం, ఆదర్శంగా బ్రతికి అందర్ని తీర్చిదిద్ది నవ సమాజం వైపు అభివృద్ధి అడుగులు వేసేందుకు అహర్నిశలు శ్రమించి, ఉత్తమమైన మార్గంలో ఎన్నో ఉత్తమ జ్ఞాపకాలు, జ్ఞాపికలు అందుకొని ఆంధ్రులతో పాటు అందరి హృదయాల్లో సుస్థిరమైన అభిమానాన్ని చోటుచేసుకున్న చదువుల సమరయోధుడు, చదవరులకు స్ఫూర్తి ప్రభావితులు, చదువుల గురుతుల్యులు, ప్రఖ్యాత చారిత్రక విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, మాజీ డి.ఎస్.ఎన్ లా వర్శిటి ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఎందరికో విద్యా మార్గదర్శకుడిగా నిలిచి, హర్షించే సమాజానికి తన వంతు కృషి సల్పుతున్న చదువుల రారాజు సెంచూరియన్ ఉపకులపతి ప్రొ||డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణరాజుతో ఫీచర్స్ఇండియా ముఖాముఖి.
ఉత్తమ ఉపాధ్యాయునిగా మొదలైన జీవన గమనంలో ఎందరికో ప్రతిభా పాఠశాలు నేర్పిన శక్తిగా, విశ్వాంతరాలకు ప్రభావితం చేసిన వ్యక్తిగా, ఇంకా నేటితరాన్ని ఉత్తతమైన మార్గంలో సమర్ధతగల సమగ్ర వృత్తి నైపుణ్యాలతో ప్రపంచంలో ఉన్నత స్థానం పొందాలని ఆశించే మనసున్న మనిషి ప్రొ||డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజు. సెంచూరియన్ ఉపకులపతిగా ఆయన మాటల్లోనే ఏమన్నారో చూద్దాం.
ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్యార్ధులకు నేర్పాల్సిందల్లా.. గౌరవించడం, గౌరవంగా బ్రతకడం, ఉత్తమ మార్గాలను ఎంచుకోవడం, ఎంచుకున్న అంశాలను శ్రద్ధగా పాటించి ఉన్నతమైన స్థానాలకు ఎదిగి, సమాజానికి సహకరించడమే మనిషిగా సార్ధకత సాధించవాళ్లమవుతామని ఆయన తెలిపారు. విద్యాలయాల్లో కేవలం చదువులే కాదు ఆట, పాట, ఆనందం, నేర్పరితనం, నేర్చుకునే గుణం, అనుకున్నది సాధించాలనే పట్టుదల విద్యార్ధులకు ఎంతో అవసరమన్నారు. మేలైన సమాజానికి ముఖ్యమైనది విద్య అన్నారు. అందుకే కళాశాలల్లో నిత్యం సంగీతం, క్రీడలు, సాంస్కృతి సాంప్రదాయాలు, బాక్సింగ్, యోగా, శిల్పకళా నేర్పరులు, అధునాతన గ్రంధాలయాలు వంటి నైపుణ్యాలు ఉండాలని, ఇందు కోంస నా వంతుగా కృషి చేశానన్నారు. ఉత్తమమైన మార్గాల అణ్వేషణలో అనుభవంతో సంపూర్ణదాయకమైన విద్యా కుసుమాలను వృత్తి విద్య వల్ల విశ్వమంతా పరిజ్ఞానం, ప్రయోజనాలు కలుగుతాయనే సిద్ధాంతంతో సెంచురియన్ విశ్వ విద్యాలయాన్ని ఉత్తరాంధ్ర ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శాశ్వతమైన భవన నిర్మాణాలతో విజయనగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సెంచూరియన్ విశ్వవిద్యాలయం లక్ష్యం దిశగా అడుగులు వేస్తుందన్నారు. నేక్ ఏ గ్రేడ్ గర్తింపు కలిగి ఉన్న విద్యాలయంగా స్కిల్, స్మార్ట్, యాక్షన్ రీసెర్చ్, కమ్యూనిటీ ఔట్రీచ్, గ్రీన్ యూనివర్శిటిని ప్రశాంత వాతావరణంలో సెంచురియన్ బోధన పద్ధతులు విద్యార్ధులకు అందిస్తున్నామన్నారు. సిద్ధాంతపరమైన ఆశయాలతో ఛైర్మన్ ప్రొఫెసర్ ముక్కటి కాంతామిశ్ర, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డీ.ఎన్.రావ్, ఒడిషా వి.సి ప్రొఫెసర్ హరిబంధు పండా ల నేతృత్వంలో తూర్పు కనుమలకు ఆనుకొని 120 ఎకరాల్లో ఒడిషాలోని పర్లాకిమిడి కేంద్రంగా ఆంధ్రకు అతి సమీపంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సెంచురియన్ విశ్వవిద్యాలయం పలు పి.జి కోర్సులు, వృత్తి నైపుణ్య కోర్సులను అందిస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో 81 ర్యాంకు పొంది, సుమారు 15 కీ ఇండష్ట్రీస్తో పార్ట్నర్షిప్ కలిగి ఉందన్నారు. 40 మేజర్ కంపెనీలతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సెంచురియన్ సిద్దంగా ఉందన్నారు. నైపుణ్యాలు గల విద్యతో పాటు తక్షణమే ఉపాధి అవకాశాలు అందుకునేందుకు విద్యార్ధులను సిద్ధం చేస్తున్నామన్నారు. స్వల్ప బడ్జెట్‌తోనే విద్యార్ధుల ఇష్టంతో ఎంపిక చేసుకున్న బ్రాంచెస్, చదవాలనుకున్న పరిమిత సబ్జెక్టులతో మేలైన విద్యావిధానానికి కట్టుబడి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. నిష్ణాతులైన విద్యావేత్తలతో విద్యార్ధులు కుతూహలంతో చదువుకుని సమగ్ర వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి, ఒడిదుడుకులు లేకుండా పాఠ్యాంశాలు చెబుతామన్నారు. విద్యార్ధులు పాస్/ఫెయిల్ అనేది లేకుండా తగిన సబ్జెక్టులతో కష్టం లేకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత పొందే అనువైన అవకాశాన్ని సెంచురియన్ కల్పించిందన్నారు. విద్యార్ధులు తీవ్ర ఒత్తిడితో మనాస్థాపాలకు గురి కావాల్సిన విద్యా విధానం ఇక్కడ లేదన్నారు. సమయ పాలనతో ఏ రోజు పాఠ్యాంశాలు ఆరోజే మననం చేసుకుని, జీవితాల్ని మార్చుకునే మహత్తర శక్తులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా విద్యార్ధులు తయారు కావాలని ఆయన అన్నారు. ఆర్ధికంగా వెనుకబాటు కలిగిన విద్యార్ధులకు సెంచురియన్ తగిన విధంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. రానున్న తరానికి బలవంతపు చదువులకంటే మెచ్చిన రంగాన్ని ఎంచుకొని, సర్వతోముఖాభివృద్ధికి ఉత్తమ మార్గాల్ని అనుసరించాలని సూచించారు. తల్లిదండ్రులు మాదిరిగా ఉజ్వల భవిష్యత్ కోసం విలువలుతో కూడిన జీవితాలను అనుసరించేందుకు అవసరమైన సాంప్రదాయాలను మెరుగుపరిచి మిగతా విశ్వవిద్యాలయాలు కంటే భిన్నంగా సెంచురియన్ టీమ్ వర్క్ చేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రాలతో పాటు ఒడిషా, చత్తీస్ఘడ్, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు ఉన్నతమైన ఆశయాలను, భవిష్యత్‌ను సెంచురియన్ అందించేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు. సమగ్రవిద్య, అవకాశాలు అందించేందుకు సెంచూరియన్ విద్యార్ధులు, తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతోందన్నారు. భావి భారత పౌరులుగా ప్రతీ ఒక్కరూ తమకు నచ్చిన రంగాల్లో విజయాలు సాధించి గొప్ప ప్రయోజకులుగా తయారై కుటుంబం గౌరవాన్ని, దేశభక్తిని చాటి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని ఆశిస్తున్నట్లు సెంచురియన్ ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజు భావితరానికి పిలుపునిచ్చారు. ఆయనతో పాటు విద్యాలయం లైజెన్ ఆఫీసర్ కె.భాస్కరరావు పాల్గొన్నారు.


