లోయలో పడిన బస్సు.. 28 మంది మతి
- 19 Views
- admin
- July 20, 2017
- జాతీయం తాజా వార్తలు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాన్ నుంచి కిన్నౌర్‌కి వెళుతున్న బస్సు రాంపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 28 మందికి పైగా దుర్మరణం చెందినట్లుసమాచారం.
బస్సు పూర్తిగా బోల్తా పడడంతో మతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన వారికి అక్కడికక్కడే అంబులెన్సుల్లో చికిత్స చేస్తున్నారు. మరికొందరిని స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు.