ఆత్మసౌందర్య రమణి
- 15 Views
- admin
- July 22, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
ధ్యానంతో దీర్ఘకాల వ్యాధులు మాయం
జుట్టురాలడం, చర్మ సమస్యలే ప్రధానం
పునరుజ్జీవానికి ధ్యానం మేలు
కార్పొరేషన్, ఫీచర్స్ ఇండియా : పని ఒత్తిడితో మెదడుపై భారం ఎక్కువై ఆధునిక జీవనంలో దీర్ఘకాల వ్యాధులతో సతమతమవుతున్నారని గ్లో అప్ బ్యూటీపార్లర్, ఆత్మసౌందర్య శిక్షణ సంస్థ అధినేత్రి రమణి అన్నారు. ఫీచర్స్ ఇండియా ప్రతినిధితో ప్రత్యేక ఇంటరివ్యూలో ఎంతో ఆసక్తికరమైన ఆరోగ్య సమస్యలు, పరిష్కారాల వివరాలు తెలిపారు. 1997లో బ్యూటీషియన్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె 250మందికి పూర్తి తర్ఫీదునిచ్చి జీవనోపాధికి మార్గం చూపారు. దీనికి గాను స్వర్గీయ మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు చేతులు మీదుగా సత్కారాన్ని పొందారు. అంతటితో ఆగక కేవలం వ్యాపారమే అనుకోకుండా అక్కయ్యపాలెం వద్ద ఉన్న సొంత ఇంటిని ధ్యానం కోసం ఉచితంగా ఇవ్వడమే కాకుండా అద్యాపకులను కూడా నియమించి, తన వంతు సాయంగా ఇతరుల ఆరోగ్యం కోసం కృషి చేయడం అభినందనీయం. ఆరోగ్యం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడిపై ఆధారపడి ఉంటుందన్నారు. జీర్ణమయ్యే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంపై జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఉంటుందన్నారు. మాంసాహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టడమే కాక, కొవ్వు వల్ల రక్తప్రసరణ జరగక ఒళ్లు నొప్పులు, హార్ట్ ఎటాక్ కు ముఖ్య కారణమని తెలిపారు. 30-35 సంవత్సరాలలో స్త్రీ మానసిక స్థితిలో మార్పులు వచ్చి తనను తాను ఒత్తిడికి గురి చేసుకుంటున్నారన్నారు. పిల్లలు నన్ను పట్టించుకోకపోవడం లేదు. నేను జీవితంలో ఏదో కోల్పోతున్నాను అనే సమస్యలతో అంతరంగా సమతమతమవుతున్నారు. పని ఒత్తిడి, యంత్రంలా రోజువారీ పనితో మెదడుపై తీవ్ర ప్రభావం దీనికి కారణమన్నారు. స్త్రీలలో మెనోపాజ్ వలన మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. పగలంతా పని ఒత్తిడి, రాత్రిపూట కలల రూపంలో మెదడుకు విశ్రాంతి లేకపోవడమే ముఖ్య కారణం. రోజూ ఇష్టమైన సాంస్కృతిక సంగీతాన్ని తక్కువ శబ్దంలూ వింటూ ప్రశాంతమైన వాతావరణంలో అరగంట కేటాయిస్తే మనలో ఒక నూతనోత్తేజం వస్తుంది. అందం, ఆనందం, ఆరోగ్యం అన్నీ మనలో కనిపిస్తాయి. శ్రావ్యమైన సంగీతం ఎంతటి ఒత్తిడిలో ఉన్నా మనషినైనా ప్రశాంతతకు తీసుకువస్తాయని, మ్యూజిక్ థెరపి ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. థైరాయిడ్ సమస్య ప్రస్తుతం ఎక్కువగా బాధిస్తుందని, ధ్యానం ద్వారా మెదడుకు ప్రశాంతత ఏర్పడి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో రసాయనిక చర్య సక్రమంగా పనిచేసి బి.సి, షుగర్, లెవల్స్ వంటి కూడా సాధారణ స్థితిలో ఉంటాయన్నారు. వయసు మళ్లిన వారు సైతం ఆత్మ స్థైర్యం తో జీవితాన్ని సంతోషంగా గడపగలరు. మెదడుకు ఆక్సిజన్ తగిన మోతాదులో అందడం వలన జుత్తు రాలడం ఆగిపోతుంది. చర్మం కూడా పునర్జీవనం పొందుతుంది. శరీరంలో నశించే కణాలకు ధీటుగా కొత్త కణాలు పునరుత్పత్తి అవుతాయి.


