జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- 13 Views
- admin
- July 22, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
మధురవాడ, ఫీచర్స్ ఇండియా : ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజపులోపులోవలో పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్ నగరంలో నివాసముంటున్నాడు.ఎప్పటిలాగే విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై రాజపులోవ బయల్దేరాడు. మారికవలసకు చెందిన స్కూల్ డ్రైవర్ అప్పలరాజు, పెద్దిపాలెంలోని బస్సును తీసుకువచ్చేందుకు జాతీయ రహదారికి వచ్చాడు. రాజపులోవకు బైక్‌పై వెళ్తోన్న శ్రీనివాస్‌ను అప్పలరాజు లిఫ్ట్ అడిగి, బైక్ ఎక్కాడు. ఆనందపురం వెల్లంకి దగ్గరకు వచ్చేసిరికి వెనుక నుండి వస్తోన్న లారీ బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు చెల్లాచెదురుగా పడిపోయింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఆనందపురం పోలీసులు మృతదేహాన్ని కేజిహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


