మిస్సింగ్….
- 15 Views
- admin
- July 22, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రావుల వలసరామచంద్రరావు
తప్పుకు హద్దు ఉంటుంది. పొరపాటుగా భావిస్తాం. కానీ హద్దు దాటిన తప్పు నేరం. ఈ నేరం చేసిన వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రజల నుంచి సాధ్యం కాదు. అలాంటి కోవకు చెందినదే ఓ సంఘటన విశాఖ జిల్లాలో దశాబ్ధ కాలం క్రితం చోటు చేసుకుంది. సమాజంలో జరిగే నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో ఫీచర్స్ ఇండియా ప్రతీ వారం అందించే క్రైం కథ – మ్యాన్ మిస్సింగ్…..
అది అనకాపల్లి మండంలోని శివారు గ్రామం.
వేసవి కాలంలో ఉక్కపోత. రోజంతా పనికి వెళ్లి వచ్చిన జనం ఆరు బయట మంచాలు వేసుకుని నిద్రపోతున్నారు. రాత్రి 9 గంటలకు వరకు మంచంపై ఉన్నా ఢిల్లీ నుంచి ఊరు వరకు ఎన్నో ఊసులు. ఆ మాటలు మద్య తెల్లవారు వెళ్లాల్సిన పొలం పనుల గుర్తిచ్చి నెమ్మదిగా నిద్రపోయారు.
అర్థరాత్రి రెండు గంటలు దాటింది. నిద్రపోతున్న ఓ నడి వయసు మహిళ కేకలు వేసింది. దొంగా..దొంగా.. ఊరంతా లేచింది. ఏమైంది.. అని ప్రశ్నించారు.
ఆమె చెప్పింది. బాగా నిద్ర పట్టింది. ఆ టైంలో మనిషి మీద పడ్డాడు. మా ఆయన అనుకున్నా .. ఇప్పుడేంటి అన్నా. సమాధానం లేదు..చీరను తప్పించబోయాడు. నిద్రలోనే పక్కకు నెట్టాను. కానీ బలవంతంగా నా నోరు నొక్కాడు. ఆ తరువాత ఆమె చెప్పలేదు.. కన్నీరు పెట్టింది.
మరి ఆ మనిషి తరువాత కనిపించలేదు. ఈ పొలాల్లోకి వెళ్లి పోయాడు. చీకటి వేళ జనం తలొదిక్కు గుంపులుగా వెళ్లారు. ఇతరుల ఆచూకీ లేదు. తిరిగి వచ్చారు. ఆ ఆడమనిషి మీద అనుమానం కలిగింది. కలలో గానే ఏమైనా అనుకున్నావా అంటూ సరిపెట్టారు. లేదు ఆమె ఎందుకు అలా చెబుతుంది. జరిగే ఉంటుంది.. మరికొందరు అన్నారు.
సూర్యుడు వచ్చాడు. జనం పనులకు వెళ్లారు. తిరిగి రాత్రి ఆరుబయట నిద్రపోయారు. అమ్మీ జాగ్రత్తే ..మళ్లీ ఈ రాత్రి ఎవరైనా మీదకు రావచ్చు జాగ్రత్త… ఆ దానికి కలవచ్చిందిలే.. మొన్నే కదా జ్వరం నుంచి తేరుకుంది. ఆ నీర్సం తగ్గలేదనుకుంటా. అమ్మలక్కలు మాటలాడుకుంటున్నారు.
ఓరేయ్.. మనూరి లక్ష్మి మీద రాత్రి ఎవడోపడ్డాడట. నిజమేనంటావా ? ఓరేయ్ దానికి మగ పిచ్చిరా.. మొగుడు ఆ పని చేయలేదని అలా చెప్పిందేమే మరో యువకుడు వెటకారమాడాడు. ఇలా రాత్రి పది గంటలకు ఊరు నిశ్చబ్ధంగా మారింది. చీకటి వ్యాపించింది. రాత్రి రెండు గంటలు దాటింది. మంచంపై నిద్రపోతున్న ఓ మహిళ కెవ్వున కేక వేసింది. దొంగా దొంగా జనం అటుగా చూశారు. కొందరు మంచం పక్కన పెట్టుకున్న కర్రను పట్టుకుని పరుగులు తీశారు.
అమ్మలక్కలు అక్కడకు చేరారు. ఏమే ఏమైందే… దొంగ సచ్చినోడు చీర లాగాడు. ఈ రాత్రి కుక్క లాగుతుందేమేనని ఛీ ..ఛీ అన్నాను. కానీ చే యి తగిలింది. ఏటా అని లేస్తుంటే నోరు నెక్కేసి మీద పడ్డాడు. లేవ లేకపోయాను. నీర్శంగా మాట్లాడుతోంది. ఆమె మాటలు వింటే నిజమే అనిపిస్తోంది.
అలా వారంలో అయిదు రోజులు ఇలా జరిగింది. ఆరు బయట నిద్ర పోవాలంటే ఆడవాళ్లకు భయం పట్టుకుంది..
.. …… ….
ఆ రోజు ఊర్లో పండగ జరుగుతోంది. ఆడవాళ్లు అమ్మవారికి మొక్కులు తీర్చారు.మగవారు మాత్రం మందు, ముక్కతో నోటి రుచి తీర్చుకుంటున్నారు. కుమారి కూడా కొత్త కట్టుకుని జుట్టు నిండా పూలను పెట్టుకుంది. రాత్రి 10 గంటలకు వచ్చే భర్త రాజు మాత్రం ఇంటికి రాలేదు. ఇదేం కొత్త కాదు పెళ్లై ఏడాది కాలంగా అలవాటైంది. మందు కొట్టి ఆలస్యంగా రావడం అలవాటు అతనికి. పండగ పూట పాత రవికే సామెతను గుర్తు చేసుకుని మూతపడిన కళ్ల మద్య మరో లోకంలోకి వెళ్లి పోయింది.
అర్థరాత్రి రెండు గంటలు దాటింది. చేతుల నుంచి మొదలైన స్పర్శ మెడ వరకు వెళ్లింది. నిద్రలో ఏదో అవుతున్నట్టు గుర్తించిన ఆమె పక్కకు తిరిగింది. మళ్లీ ఓ చేయి మెడ నుంచి కిందకు దిగింది. జాకెట్ పైకి చేరింది. మా ఆయన ఎప్పడొచ్చాడా ? అని చేయి తీసింది. కానీ ఈ చేయి తన నోటికి అడ్డంగా పడింది. పెనుగులాట మద్య ఆమె పై చీర తొలగింది. కుమారి మాత్రం ఆగలేదు. బలం అంతా కూడబెట్టుకుని లేచింది. ఆ మనిషిని కిందకు తోసింది. దీపం దగ్గరకు పరుగు తీసింది. వెలుతురులో కింద పడిన వ్యక్తి కనిపించాడు. గొంతు నుంచి కెవ్వు మంటూ వచ్చిన కేకకు తన నోటితో అడ్డం పెట్టుకుంది.
మీ ఆయనకు విషయం చెప్పకు చెప్పావంటే చంపేస్తాను. ఆ మనిషి బెదిరించాడు. కుమారి ఊహించలేదు.. ఇంట్లో మనిషి.. అది తన భర్త తండ్రి ఇలా చేస్తాడని.. కానీ నా మాట ఎవరు వింటారు. తాగు బోతు మొగుడ్ని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. కుమారి దారుణాన్ని రహస్యంగా ఉంచింది.
కాల చక్రంలో రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో జరుగుతున్న అక్రుత్యం ఊరి వైపు మళ్లింది. నిద్రపోవాలంటే ఆడవాళ్లు భయపడుతున్నారు. పడుకుంటే పాడు చేస్తున్నారు. ముందుగా దెయ్యం అనుకున్న జనం మనిషే అని నిర్థార?కు వచ్చారు.
.. ఊర్లో జనం ఓ రాత్రి మాత్రం కాపు కాశారు. ఆడవాళ్లు బయటపడుకున్నారు. మంచాలపై. అర్థరాత్రి రెండు గంటల తరువాత చీకటిలో ఓ ఆకారం వచ్చింది. మంచం మీద పడుకున్న మహిళపై చేయి పడింది. కేకలు వేసింది. రడీగా ఉన్న జనం పరుగున వచ్చి పట్టుకున్నారు. చేతికి అందిన మేర తన్నారు. చీకటి నుంచి దీపం వెలుగులో చూశారు. ఆశ్చర్యం ఊర్లో మనిషే. రిక్షా చిన్నారావు. నీకేం పోయా కాలంరా ? ఇంత కాలం నీవేనా ఈ చెండాలం ..చేస్తున్నావు..నీకు కోడలు ఉంది కదరా తిట్ల దండకం విప్పారు జనం. అనకాపల్లి పోలీసులకు అప్పగించారు. కొంత కాలం తరువాత కుమారి ఊర్లో ఆడవాళ్ల దగ్గర మామ చేసే అక్రుత్యం గురించి వివరించింది. నిజం చెప్పింది.
……. ….. ….
జైలు నుంచి బెయిల్ పై వచ్చిన చిన్నారావు.. కొంత కాలం తరువాత మళ్లీ అలజడి చేశాడు. మద్యం తాగితే చాలు ఆడమనుషులు భయంతో ఇంట్లో దాక్కునే రీతిన మారాడు. పోలీసులకు చెబితే ఇక్కడ మరో పని ఉండదా? ఇక ఏదైనా చూస్తే చూద్దాం….పోలీసులు కసురుకున్నారు.
.. ఏడాది కాలం గడిచింది. ఓ చీకటి రోజు చిన్నారావు తాడి స్టేషన్ లో దిగి ఇంటి వైపు వస్తున్నాడు. నాలుగు వైపుల నుంచి మనుషులు వచ్చారు.కర్రలతో కొట్టారు. రక్తం కారింది. రక్షించుకునేందుకు పరుగులు తీశాడు. కానీ అవకాశం లేకపోయింది. కింద పడిపోయాడు. ప్రాణం గాల్లోకి వెళ్లి పోయింది. ఆ రాత్రి అతని మ్రుతదేహాం గ్రామం వెనుక కొండల మద్యకు తరలించారు. నిప్పు పెట్టారు. విషయం తెలియని ఉదయం భానుడికి అక్కడ బూడిద కనిపించింది. తండ్రి కనిపించకపోవడంతో చిన్నారావు కొడుకు రెండు రోజుల తరువాత పోలీసులకు పిర్యాదుచేశాడు. తండ్రి కనిపించలేదని.
కుమారి సంతోషంగా ఉంది. రాత్రి హాయిగా నిద్రపోతోంది. కానీ ఏ రాత్రైనా చీర చెరుగుతుందా అన్న భయం మాత్రం వెంటాడుతోంది.
అనకాపల్లి పోలీసులు మాత్రం మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రాత్రి జరిగిన విషయం తెలియని భానుడు కొండల మద్య రోజు వస్తూ సాయంత్రం వెళ్లి పోతున్నాడు.
పదేళ్లు గడుస్తున్నాయి. చిన్నారావు గురించి చర్చించుకోవడం మర్చిపోయారు. ఏమయ్యాడో అని కుమారి మాత్రం ఆలోచిస్తోంది.మామ తిరిగి వస్తాడా అని.. ఓ రోజు ఓ అమ్మ మాత్రం చెప్పింది. మీ..మామ తిరిగి రాడు..గ్రామస్ధులంతా చంపేశారని.. కుమారి ఆ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదు.
కొత్తగా వచ్చే పోలీసులకు మాత్రం పెండింగ్ లో ఉన్న మ్యాన్ మిస్పింగ్ అలాగే కనిపిస్తోంది….


