పేదల సంక్షేమమే బిజెపి ఆశయం
- 16 Views
- admin
- July 24, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
నీతి నిబద్ధలతో ప్రజల పక్షాన ఉంటాం
జన సమస్యలపై 3వేలు విన్నపాలు వివిధ శాఖలకు పంపాను
జనావాసాల మధ్యన మద్యం షాపులని వ్యతిరేకిస్తాను
లక్షా 63వేల సభ్యత్వం కలిగి వున్నాం
ఫీచర్స్ ఇండియాతో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రజా మౌళిక అవసరాలు తీర్చగలిగేవారే నిజమైన ప్రజానాయకులు. జనం నచ్చి మెచ్చి నమ్మకంతో ప్రజా ప్రతినిథిగా ఎన్నుకుని శాసనసభకు పంపుతారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ప్రజా ప్రతినిథులు పనిచేస్తారు. అయితే కొద్ది మంది మాత్రమే జనం సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు తమ ప్రయత్నాలు చేస్తారు. ప్రజల నమ్మకాలను, స్థానిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సదీర్ఘకాలంగా ఎన్నో సమస్యల సుడిగుండంలో నలుగుతున్న బడుగు బలహీన వర్గాల అక్కరతలు తీర్చి, కొండవాలు ప్రాంతాల ప్రజల సమస్యలకు నిరంతరమూ కృషి సల్పుతూ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి రహదారులు, మంచినీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించి, ఇశాఖ భూ కుంభకోణాలపై ప్రశ్నించి, నీలదీసిన ఉత్తర నియోజకరవ్గ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజుతో ఫీచర్స్ ఇండియా ఆమీతుమీ. ప్రజల్చిచ్చిన అవకాశంతో నీతి నిబద్ధతలతో కూడిన సేవలను అందించడమే ధ్యేయంగా నాకున్న పరిధిల్లో వీలున్నంత అభివృద్ధి కార్యక్రమాలను నిజాయితీగా చేపట్టానని ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు తెలిపారు.
గతంలో పరిష్కారం లేని ఎన్నో క్షేత్రస్థాయి సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖలకు సుమారు 3వేల దరఖాస్తుల్ని పంపి, ప్రజా సమస్యలపై స్పందించానన్నారు. మౌళిక సదుపాయాలైన రహదారులు, మంచినీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం వంటి పలు సమస్యలపై ప్రజా పక్షాన ఉండి పనిచేశానన్నారు. మిత్రపక్షం తెలుగుదేశం, పవన్ జనసేన మద్ధతుతో గెల్చానని అదే స్ఫూర్తితో సీనియర్ బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు, ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఏ ప్రాంత ప్రజలకైనా ప్రశ్నించే అధికారం ఉందని, అభివృద్ధి చెందడం ప్రజల హక్కని అన్నారు. కొండవాలు ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి వుందని, అభివృద్ధి కార్యక్రమాలకు గుత్తేదారులు ముందుకు రావడం లేదన్నారు. మద్యం జనావాసాలలో పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తానని, మహిళలకు మద్ధతు పల్కి, జనం మధ్య మద్యం షాపులు పెడితే కేసులు పెడతానని, షాపుల యజమానుల్ని హెచ్చరించామన్నారు. అక్రమ వడ్డీలను వసూలు చేసే వ్యాపారస్థుల చెర నుంచి సామాన్యుల్ని రక్షించి, భరోసా కల్పించామన్నారు. అందరికీ అందుబాటులో వున్న ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంకుల ద్వారా పేదలు రుణాలు పొందవచ్చన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ, అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన నిరుపేదలకు పక్కా గృహాలు ఆంధ్రలో లక్షా 93వేల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర సబ్సిడి ఇస్తుందన్నారు. ఆధునిక హంగులతో మూడు రకాల ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధంగా వున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిజాయితీతో కూడిన పారదర్శకతగల అభివృద్ధి ఫలాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. విశాఖ భూ కుంభకోణం బాధితులైన ముదపాక తదితర గ్రామీణ ప్రజలకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. సుమారు రెండువేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన వివరాలు సిట్‌కు అందించినట్లు తెలిపారు. గతంలో విశాఖ భూ కుంభకోణాలపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రజల్ని మోసం చేసి దౌర్జన్యం చేస్తే ఊరుకోమని, ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఎలాంటి వారైనా చట్టానికి సమానమేనన్నారు. మిత్రపక్షంలో ఉన్నప్పటికి ప్రజా పక్షాన పనిచేయడం మా గురుతర బాధ్యతగా స్వీకరిస్తామన్నారు. ఒకప్పుడు 200మంది బిజెపి సభ్యత్వం ఉంటే, ఈనాడు ఇక్కడ లక్షా 63వేల మంది బిజెపి కార్యకర్తలున్నారన్నారు. అధికారికంగా లక్ష మంది ఉన్నట్లు తెలిపారు. బిజెపి ఎదుగుతుందని భవిష్యత్తులో ఇంకా భయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. స్మార్ట్ విశాఖలో మారుమూల ఉన్న తిక్కవానిపాలెం గ్రామాల్లో ఇళ్లు, మంచినీరు, రహదారులు మెరుగుపర్చామన్నారు. ప్రజా సంక్షేమానికి నిస్వార్ధంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిథిగా ప్రజల కష్టాల్ని తెలుసుకుని సత్వర పరిష్కారం దిశగా పనిచేయాల్సిన అవసరం వుందన్నారు. భవిష్యత్తు ఎన్నికల పొత్తువంటి అంశాలకు ఇంకా సమయం వుందని చెప్పారు. ప్రజలు తనకిచ్చిన భాధ్యతలను నీతి నిజాయితీతో నిర్వహించి ప్రజా సమస్యలు తీర్చేందుకు తన శక్తి మేర ప్రయత్నాలు చేస్తానని, వీలున్నంత వరకూ ప్రజల పక్షాన, జన సంక్షేమమే ధ్యేయంగా బిజెపి ఆశయాలు, లక్ష్య సాధనకు, ప్రజలు, కార్యకర్తల మద్ధతుతో రాజీలేని సేవల్ని అందిస్తానని బిజెపి ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు.


