సిట్ ఎదుట హాజరైన చిన్నా
- 17 Views
- admin
- July 25, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నా సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం అబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్న చిన్నాను కార్యాలయంలోని ఐదో అంతస్తులో అధికారులు విచారిస్తున్నారు.
నిన్న సినీ నటుడు నవదీప్‌ను 11 గంటలపాటు సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, విదేశీ పర్యటనలు, ఈవెంట్లకు సంబంధించి అధికారులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మరోవైపు డ్రగ్స్ వ్యహహారంలో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినీనటి కాజల్ మేనేజర్ జోసెఫ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సినీ నటి ఛార్మి సిట్ అధికారుల విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీర్పు వెలువడనుంది.


