విశాఖలో సీఎం హడావుడి
- 10 Views
- admin
- July 26, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
గాజువాక: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడి రెండో విడతగా బుధవారం 21వేల నివేశనా స్థల పట్టాలు పంపిణీ చేయనున్నారు. స్టీలుప్లాంట్ ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుంచి పట్టాలు లబ్దిదారులకు అందజేస్తారు. ఇందుకోసం 150స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాతో పాటు, నగరం నలుమూలల నుంచి లబ్దిదారులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్క గాజువాక నియోజకవర్గానికి 240 బస్సులు కేటాయించారు. ఈ బస్సులు జోనల్ కార్యాలయం, మెయిన్‌రోడ్డు, బిసిరోడ్డు, పాత మున్సిపల్ కార్యాలయం నుంచి బయల్దేరాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3.30గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం పట్టాల పంపిణీ చేపడతారు. ఇందుకోసం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకే లబ్దిదారులకు ముఖ్యమంత్రి సందేశంతో కూడిన కరపత్రాలు అందించడంతో పాటు వారిని సభా వేదిక వద్దకు చేర్చేందుకు బస్సులు వివరాలు వివరించారు. ఇందుకోసం జన్మభూమి కమిటీ సభ్యులు అవగాహనా సదస్సులు సయితం నిర్వహించారు. ఒక్కో స్టాల్ నుంచి 150మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. కాగా, గాజువాక నియోజకవర్గానికి 301,296జివోల ద్వారా ఆక్రమణలను క్రమబద్దీకరించి 6228పట్టాలు అందజేయనున్నారు. ఇందుకోసం 48స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబులతో కలిసి ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే జిల్లాకలెక్టర్, జాయింట్‌కలెక్టర్లు పట్టాల పంపిణీ ఏర్పాట్లు పరిశీలించారు.


