నంద్యాల ఉప ఎన్నిక ఆగస్టు 23
- 20 Views
- admin
- July 27, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
దిల్లీ: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంఉపఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
షెడ్యూల్ వివరాలు..
-ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు నామినేషన్ల స్వీకరణ
-ఆగస్టు 7న నామినేషన్ల పరిశీలన
-నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 9
-ఆగస్టు 23న ఉపఎన్నిక
-ఆగస్టు 28న ఓట్ల లెక్కింపు, ఫలితం వెల్లడి
సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ తితో నంద్యాలలో ఉప ఎన్నికజరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెదేపా నుంచి భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి, వ్కెకాపా తరపున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వ్కెకాపా నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం తెదేపాలో చేరారు. దీంతో ఆ స్థానం తమదేనంటూ వ్కెకాపా అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించింది. వ్కెఎస్ చనిపోయినప్పుడు తాము అభ్యర్థిని నిలబెట్టలేదని.. అదే సంప్రదాయం కొనసాగించాలని తెదేపా చేసిన విజ్ఞప్తిని వ్కెకాపా తిరస్కరించింది. దీంతో నంద్యాలలో ఉప ఎన్నిక అనివార్యమైంది.