మద్యపాన నిషేధ ఉద్యమానికి మేము సైతం
- 20 Views
- admin
- July 27, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం,ఫీచర్స్ ఇండియా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మద్యపాన నిషేద ఉద్యమానికి తమ పాట ప్రాణం పోస్తుందని కళాకారుల సంఘం సభ్యులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు అక్రమ వ్యాపారంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, తమ పాట వీరందరి పోరాటానికి స్పూర్తినిస్తుందని దేవిప్రసాద్ అన్నారు. మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి నగరంలోని ప్రజా కళాకారులు పాటలు పాడి సంఘీభావం తెలిపారు. ప్రజాకవి, గాయకుడు దేవి శ్రీ, ప్రజానాట్య మండలి కళాకారులు సుభాషిణి, చంటి, మౌళాలి, అరుణోదయ సాంస్క్రృతిక సమాఖ్య కళాకారులు నిర్మల, వెంకటలక్ష్మి, భాస్కర్, వైకాపా సాంస్క్రృతిక విభాగం కళాకారులు రాధ, విజయ్‌కుమార్‌లు మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభవాల గురించి తమదైన శైలిలో పాటల ద్వారా వినిపించారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ మద్యంపై మహిళలంతా చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తమ పాటల ద్వారా మద్దతు తెలిపేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడిపడితే అక్కడ మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న తీరును నిరసిస్తూ గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ బడి, గుడి తేడా లేకుండా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం మహమ్మారి వల్ల అనేక మంది బ్రతుకులు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


