విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రతిపక్షం పని
- 16 Views
- admin
- July 27, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం
విజయవాడ: ఇంట్లో పెళ్లి చేయలేము గానీ.. వూళ్లొ పెళ్లిళ్లన్నీ చెడగొడతాం అన్నట్లుగా ప్రతిపక్షం వ్కెఖరి ఉందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అభివ ద్ధిలోనూ, సంక్షేమంలోనూ తమతో ఎక్కడా పోటీ పడలేని వ్కెకాపా కుల, మత, ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివ ద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందఠంగా లోకేశ్ మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. విజయనగరంలో భూగఠ డ్క్రెనేజీ వ్యవస్థను త్వరలోనే మెరుగుపరుస్తామని.. నగరంలో రహదారులు, వీధి దీపాల సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ తరహాలోనే త్వరలో విజయవాడలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు.