విమానాలతో సూర్యగ్రహణ వేట.. తొలిసారి సూర్యుడి కరోనాను పరిశీలించనున్న నాసా
- 19 Views
- admin
- July 27, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
వాషింగ్టన్: విమానాలతో సూర్యగ్రహణాన్ని వెంటాడుతారట. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. అమెరికా శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుత ుందన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఆగస్టు 21న అమెరికాలో సంపూర? సూర్య గ్రహణం ఏర్పడనున్నది. ఆ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడే ద శ్యాలను బంధించడానికి, సూర్యుడి కాంతివ లయాన్ని పరిశీలించడానికి శాస్త్ర వేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం నాసాకు చెందిన డబ్ల్యుబీ-57ఎఫ్ రీసెర్చ్ జెట్లను వినియోగిం చనున్నారు.
అమెరికాపై చంద్రుడి నీడ పడే మార్గంలో ఈ జెట్లు ప్రయాణిస్తాయి. అమెరికాలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్త అమిర్కాప్సి నేత త్వంలోని బ ందం ఈ ప్రయోగం నిర్వహించనున్నది. డబ్ల్యుబీ-57ఎఫ్ విమానాల ముందు భాగంలో రెండు టెలిస్కోప్‌లు అమర్చి ఉంటాయి. చంద్రుడి నీడ విస్తరిస్తున్న కొద్దీ జెట్లు అదే మార్గంలో ప్రయాణిస్తూ సూర్యుడి కరోనాను థర్మల్ ఇమేజ్‌లుగా చిత్రీకరించ నున్నాయి. సూర్యుడి ఉపరి తలంపై వేల డిగ్రీల ఉషోసఖీ?గ్రత ఉంటుంది. దీనిని ఫోటోస్పియర్ భాగం అంటారు. మనకు కనిపించే సూర్యుడి ఆకారం ఇదే. సూర్యుడి చుట్టూ అత్యధిక ఉషో?గ్రతలు ఉన్న మరో కాంతివలయం ఉంటుంది. దీనిని కరోనా అని పిలుస్తారు.
వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ కరోనాలో లక్షల డిగ్రీల ఉషో?గ్రత ఉంటుంది. కరోనాలో చిన్నచిన్న అణువుల విసోాటేనాలు జరుగుతుంటాయని అందువల్లే అత్యధిక ఉషో?గ్రతలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ విసోాటేనాలను నానో ఫ్లేర్స్ అంటారు. అయితే విసోాటేనాలు ఎలా జరుగుతున్నాయో ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు. తాజా ప్రయోగంతో ఆ గుట్టు వీడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కప్పేసిన తర్వాత సూర్యకిరణాలు వక్రీభవనం చెందుతాయి. ఆ సమయంలో కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ద శ్యాలనే ఆగస్టు 21న పరిశోధకులు జెట్స్ సహాయంతో చిత్రీకరించనున్నారు. జెట్స్‌లో ఉన్న టెలిస్కోప్‌లు సెకనుకు 30 హైడెఫినేషన్ ఇమేజ్‌లు తీయగలవని, వీటిని విశ్లేషిస్తే నానోఫ్లేర్స్ గుట్టు తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. రెండు జెట్స్‌ను హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఇవి 50 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తూ మూడున్నర నిమిషాలపాటు సాగనున్న సూర్యగ్రహణాన్ని పరిశీలించనున్నాయి. చంద్రుడి వల్ల ఏర్పడే నీడ భూమితో పోల్చినప్పుడు 50వేల అడుగుల ఎత్తులో 20-30 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు.


