అంగన్వాడీ సెంటర్లను తగ్గించొద్దు
- 19 Views
- admin
- August 2, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
కార్పొరేషన్, ఫీచర్స్ ఇండియా : అంగన్వాడీ లక్ష్యాలకు విరుద్ధంగా మున్సిపల్, పట్టణాల్లో 3126 సెంటర్లను 1026 సెంటర్లుగా కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటీయు) జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.అరుణ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతీ జనావాసాల పరిధిలో అంగన్వాడీ సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ప్రతీ 400 నుండి 800లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్, 150 నుంచి 400 జనాభా పరిధిలో మిని అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ పరిధిలో గర్భిణులు, చిన్నారులకు ఆరు రకాల సేవలు అందిస్తున్నారన్నారు. వీటిని కుదించడం వల్ల ఆ ప్రాంతంలో ఈ సేవలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రక్తదానంతో ప్రాణదానం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : వైజాగ్ జర్నలిస్టు ఫోరం, విశాఖ స్మార్ట్‌సిటి వీడియో జర్నలిస్టు వెల్ఫేర్ అసోషియేషన్ల ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా జర్నలిస్టులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తం కొరత అధికంగా ఉందని, ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన ఏయు వి.సి ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ, రక్తదానం చేయడం వల్ల దాతకు కొత్త రక్తంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఇప్పటి వరకూ 60సార్లు రక్తదానంలో పాల్గొనన్నారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శీనుబాబు, కార్యదర్శి దుర్గారావు, వీడియో జర్నలిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి అమిత్, విజెఎఫ్ సభ్యులు ఈశ్వరరావు, దివాకర్, ఏఎస్ రాజా బ్లడ్ కేంప్ వైద్యురాలు డాక్టర్ రాధారాణితో పాటు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


