నదుల అనుసంధానంతో 15వేల మెగావాట్ల విద్యుత్తు
- 17 Views
- admin
- August 4, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళన తరహాలోనే ఇతర నదుల్లోనూ శుద్ధి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఉమా భారతి తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ గంగా నది ప్రక్షాళన గురించి ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం గంగా నది క్లీనింగ్‌ను కీలక ప్రాజెక్టుగా చేపట్టిందన్నారు. గంగా నది రూటు మొత్తం క్లీనింగ్ చేస్తున్నామన్నారు. కెన్, బెత్వా నదులను అనుసంధానం చేయనున్నట్లు ఉమాభారతి చెప్పారు. వాపి, నర్మదా నదులను కూడా అనుసంధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు. నదుల అనుసంధానం వల్ల సుమారు 15వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు. నదుల అనుసంధానం గురించి ఎంపీ ఆంద్రో అదుసుల్ కూడా మాట్లాడారు.