‘బ్లూవేల్’ను రద్దు చేయాలి.. రాజ్యసభలో ఎంపీల డిమాండ్
- 12 Views
- admin
- August 4, 2017
- జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
న్యూఢిల్లీ: బ్లూ వేల్ ఛాలెంజ్. ఇదో ఆన్లైన్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ గేమ్ సంచలనం రేపుతున్నది. ఎందుకంటే ఈ గేమ్ ఆడుతున్న యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ రాజ్యసభలోనూ సభ్యులు ఓ ప్రశ్నను లేవనెత్తారు. ఇటీవల ముంబైలో ఓ 14 ఏళ్ల యువకుడు బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ఆడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలను వదులుకున్నాడు. బ్లూ వేల్ ఛాలెంజ్ అంశాన్ని ఎంపీ అమర్ శంకర్ సబ్లే సభలో లేవనెత్తారు. టాస్క్‌ను పూర్తి చేయాలన్న తపనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ గేమ్ మాయలో మరింత యువత పడే అవకాశాలున్నట్లు ఆయన అన్నారు. ఆన్లైన్లో ఇలాంటి డెత్ గేమ్స్ చాలా ఉన్నాయని మరో ఎంపీ వికాశ్ మహాత్మా అన్నారు. అన్ని ఆన్లైన్ గేమ్‌లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలువైన విద్యను పిల్లలకు అందించాలని ఎంపీ వికాశ్ సూచించారు.
బ్లూవేల్ ఛాలెంజ్ అంటే..
ఈ ఆటే ఆడేవాళ్లు అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. ప్రైవేటు గ్రూపులకు చెందిన అడ్మిన్లు ఆ సవాళ్లను విసురుతారు. దాదాపు 50 రోజుల పాటు ఈ గేమ్ నడుస్తుంది. ఓ భయంకరమై సినిమాను చూడటంతో ఈ గేమ్ మొదలవుతుంది. ఆ తర్వాత గేమ్ తారాస్థాయికి చేరుతుంది. ఓ దశలో ఆటగాళ్లు తమను తాము కూడా గాయపరుచుకుంటారు. ఇక 50వ రోజున ఆత్మహత్య చేసుకోవాలని సూచిస్తారు. పార్టిసిపెంట్ దానికి సంబంధించిన వీడియోను, ఫోటోలను కూడా తీయాలన్న నిబంధలు ఉన్నాయి. అయితే ఈ గేమ్‌ను ఆడుతున్న యువత టాస్క్ మత్తులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
రష్యాకు చెందిన 22 ఏళ్ల ఫిలిప్ బుడెకిన్ అనే వ్యక్తి ఈ గేమ్‌ను సష్టించారు. ఇతనికి సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారన్న ఉద్దేశంతో అతన్ని అరెస్టు చేశారు. సూసైడ్ డేర్ గేమ్ కోసం వెతుకుతున్న యువతను అడ్డుకునేందుకు సోషల్ మీడియా కూడా తనవంత ప్రయత్నం చేస్తున్నది. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ వల్ల తూర్పు యూరోప్‌లో 130 మంది, అమెరికాలో ఇద్దరు టీనేజర్లు మ తిచెందారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న పిల్లలను తల్లితండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని, వారితో ఆన్లైన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


