సమాజ సంప్రదాయాల రూపం మధులిక
- 27 Views
- admin
- August 4, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
తల్లిదండ్రుల స్ఫూర్తి, కుటుంబ ప్రోత్సాహాంతో రచయితయ్యాను
-నవ సమాజానికి నా వంతు ధర్మాన్ని అందిస్తాను
అభిరామ్, అరకు కథలు సిద్ధమౌతున్నాయి
-ప్రముఖ రచయిత, దర్శకురాలు తంబళ్లపల్లి రమాదేవి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సమాజంలో పూర్వీకులు ఆశించిన సంస్కృతిక సంప్రదాయాన్ని, నైతిక విలువలను ఆచరించి మరో నవ్య సమాజానికి అందించడం మానవీయ దృక్పథం. జీవరాశుల్లో మానవుడు తెలివైనవాడు. ఆకాశాన్ని జయించిన శూరుడు, ధీరుడు. నవీన నాగరికత రాజ్యమేలుతున్న నేటి వ్యవస్థలో సాంప్రదాయాలు చెరిగిపోయి మరిచిపోయేందుకు సిద్ధంగా ఉన్న చిహ్నాలుగా మిగులుతున్నాయి. మాకెందుకులే అనుకుంటే మానవ సమాజమే మట్టిగలిసిపోవాల్సి వస్తుంది. ఎవరో ఒకరు, ఏదో ఒక మంచి నిర్ణయం మేలైన సమాజాన్ని నిర్మించేందుకు ఓ ప్రయత్నం చేస్తేగానీ భావి తరాల మనుగడ భారమవుతుంది. ఇంటికో పువ్వు, ఈశ్వరునికో దండ అన్నారు పెద్దలు. వారిచ్చిన స్ఫూర్తితో సమాజ సాంప్రదాయాలు కాపాడి ఓ మంచి కుటుంబ వ్యవస్థ ఈ సంఘంలో నడవాలన్న సదుద్దేశ్యంతో మధులిక కావ్యం రూపంతో చక్కని రచయితగా పలువురు ప్రశంసలు పొందిన తంబళ్లపల్లి రమాదేవితో ఫీచర్స్ ఇండియా ముఖాముఖి.
నా తల్లిదండ్రులు జయలక్ష్మి, వెంకట్రామయ్య, నా ప్రతిభకు ప్రోత్సాహం ఇచ్చిన భర్త టి.రవికుమార్(ఐపిఎస్), కుటుంబ పెద్దల ఆశీర్వాదం నా సంతాన కుసుమాలు ఉదయ్కిశోర్, శ్రీహరిణి ల ప్రేమాభిమానాలు, నా గురువు ప్రముఖ ఫిల్మ్ మేకర్ సత్యానంద్, వదిన శాంతి ఆశీస్సులతో, మరెందరో పెద్ద దీవెనలతో రచయితగా , దర్శకురాలిగా ముందడుగు వేసేందుకు కృషి జరుగుతుందని టి.రమాదేవి ఫీచర్స్ ఇండియాకు తెలిపారు. జీవితంలో ఏదో సాధించాలి, మానవ జీవితానికి పరమార్ధం వచ్చే పనిని సాధించాలనే శుభసంకల్పంతో సాంప్రదాయలను, సాంప్రదాయాలను పరిరక్షించాలనే తపనతో ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో రచనలను ఇష్టపడినట్లు తెలిపారు. చదువు, సంస్కారం, ఉమ్మడి కుటుంబాల భాద్యతలు, సాంప్రదాయాలు, మంచి విలువలతో కూడిన కట్టుబాట్లు, ఆచార సాంప్రదాయాలు లోగిలిగా మానవ సమాజం వర్ధిల్లాలనే వ్యక్తులుగా నా వంతు ఈ చిన్ని ప్రయత్నం కొనసాగిస్తునన్నారు. మాల్గఢి కథలస్ఫూర్తితో అరకు కథలకు శ్రీకారం చుట్టానని, అభిరామం కావ్యం ద్వారా స్నేహం, బాంధవ్యాల మేళవింపుగా వెయ్యి పేజీలతో రెండు భాగాలుగా అభిరామం పాఠకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు రమాదేవి అన్నారు. నేటి యువత నూతన సంగతులను చాకచక్యంతో అర్ధం చేసుకుని దూసుకెళ్లే మనస్థత్వం వున్నవారని, వీరికి సరైన సమయంలో ఆచరించదగిన విషయాల్ని తెలియజేయాల్సిన అవసరం కుటుంబ పెద్దలపై ఉందన్నారు. స్టార్ మేకర్ సత్యానంద్, ఆయన భార్య శాంతి లు నాలోవున్న తపనను పరిశీలించి, దర్శకత్వ భాధ్యతలు చేపట్టాలని ప్రోత్సహించారని ఆమె తెలిపారు. ఔత్సాహిక కళాకారుల్లో కళానైపుణ్యాల్ని బయటకు తీయాల్సిన దర్శకత్వ పటిమ ఉండాలన్నారు. ‘మంచు కురిసే వేళలో’, ‘నేను కిడ్నాప్ అయ్యాను’ రెండు సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశానన్నారు. ఏ పనినైనా అంకిత భావంతో తపస్సుగా భావించి కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయని, మానవ సమాజానికి విలువలుతో కూడిన మంచిని చెప్పాలన్నారు. ఆధునికత మన పూర్వీకులు నుంచే వచ్చిందని, వాళ్లు చెప్పిన, ఇచ్చిన పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతో ఆదర్శవంతమన్నారు. మన దేశీయ సాంప్రదాయం ప్రకారం చిన్న తరహా ఫిల్మ్‌లను తీస్తున్నామని, ఇందులో ధీరుభాయ్ నటన బాగా వచ్చిందన్నారు. నేటి సమాజానికి ఏమి చెప్పాలో, నిజాయితీతో, ముక్కుసూటిగా, విషయం అర్ధమయ్యేలా చెప్పాల్సివుందని, నేటి యువతకు తేలిగ్గా అర్ధమయ్యేలా సంభాషణ దృశ్యాలు ఉండేలా ఫిల్మ్ మేకింగ్ జరుగుతోందన్నారు. భారతదేశంలో విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలున్న ప్రజలున్నారని, భిన్నత్వంలో ఏకత్వం గల సమాజాన్ని పరిరక్షించుకుని, ఆచార, సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన భాధ్యత మేధావి వర్గాల్లో ఉందన్నారు. మత్తులో చిత్తవుతున్న యువతకు సందేశాత్మక విలువలుతో కూడిన చిత్రాలను అందించాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను జనంలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. మధులిక, స్ఫూర్తి నవలలకు మంచి స్పందన వచ్చిందన్నారు. అభిరామ్, అరకు కథలు,జై భారత్ వంటి కావ్యాలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సును ఆశించే అంశాలతో కూడిన డాక్యుమెంటరీ చిత్రాలకు ఆలోచన జరుగుతుందన్నారు. నా భర్త రవికుమార్‌మూర్తి పోలీసు అధికారిగా నిజాయితీతో పనిచేస్తూ, సమాజానికి అవసరమయ్యే రచనలకు నాకు వెన్నంటే వుంటూ ఆయనిచ్చిన ప్రోత్సాహం, స్ఫూర్తి మరువలేనిదన్నారు. పిల్లలు ఉదయ్కిశోర్, శ్రీహరిణి ల ప్రేమాభిమానాలకు మాతృమూర్తిగా ఎంతో గర్విస్తున్నానన్నారు. పితృసమానులైన అత్తమ్మ, మామయ్యలు శశిరేఖ, చిన్న నర్సింహమూర్తి, రాజరాజేశ్వరి పీఠం నిర్వాహకులు లక్ష్మణాచార్యులకు పాదాభివందనాలు అన్నారు. సినీ నటులు సుమన్, వాణీశ్రీ, రమాప్రభ, కిశోర్‌దాస్, చిత్రదర్శకులు విజయభాస్కర్, బి.వి.వి.చౌదరి, సురేంద్రకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. నవ సమాజ స్థాపనకు రమాదేవి రచనలు ఎంతో ఉపయుక్తంగా ఉండి, మేలుకొల్పాలని ఆశిద్దాం.
పీస ఆదవ్కుమార్, స్టాఫ్ రిపోర్టర్


