సోనియాకు భంగపాటు తప్పదా ?
- 17 Views
- admin
- August 4, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో విపక్ష కాంగ్రెస్ నాయకురాలు సోనియా.. ఇంత సీరియస్‌గా తీసు కున్న అంశం మరొకటి ఉండకపోవచ్చు. గత ఆరు సార్లుగా తాను రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా అందిస్తున్న తన వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు, ఈ దఫా కూడా పదవి కట్టబెట్టా లని తాను భావిస్తే.. సమీకరణాలు కుదరకపోవడం, బలం చాలకపోవడం, వీటికి తోడు పాలక కూటమి నుంచి ఎదురవుతున్న పరిస్థితులు, ప్రతికూల వాతా వరణం ఇవన్నీ బహుశా ఆమెను చాలా చికాకు పెడు తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్న అసహనం, పాలక కూట మిపై మండిపాటు ఇవన్నీ కూడా దీనినే సూచిస్తు న్నాయి. అహ్మద్‌ను గెలిపించుకోవడంలో సోనియా కు భంగపాటు తప్పేలా లేదు. తాజాగా గుజరాత్ ఎంపీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండరాదంటూ కోర్టు కెక్కిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగలడం ఇందుకు మరో నిదర్శనం. అహ్మద్ పటేల్‌ను గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపించడాన్ని కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఆ రాష్ట్రంలో వారి కి ఉన్న బలం మీదనే వారికి బోలెడు సందేహాలు. ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యం, ఉన్నవారిలోనూ కొందరు అసంతప్తితో జంపింగ్‌లకు సిద్ధంగా ఉన్నారనే సమా
చారం అన్నీ కలిసి అక్కడి ఎమ్మెల్యేలతో బెంగుళూరులో క్యాంపు రాజకీయాలు నడపడానికి ప్రేరేపించాయి. ఒకవైపు రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతోంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా క్యాంపుల్లో విలాసాల్లో ఉండడం.. పరువు తీసేస్తున్నా సరే.. క్యాంపునుంచి ఎవరినీ బయటకు పంపలేదు. కానీ.. ఈలోగా క్యాంపు బాధ్యతలు, సదరు ఎమ్మెల్యేల ప్రలోభ బాధ్యతలు చూస్తున్న కన్నడ మంత్రి డికె శివకుమార్ ఆస్తులపై ఐటీ దాడులు , నగదు స్వాధీనం వారికి అనూహ్యమైన దెబ్బ కావచ్చు. ఈలోగా.. గుజరాత్ రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో ‘నోటా’ ఆప్షన్ కూడా ఉంటుందనే మాట వారికి మింగుడు పడలేదు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. అహ్మద్ ను ఎలాగైనాసరే రాజ్యసభకు పంపాలని అనుకుంటే.. కాంగ్రెస్ వేసే ప్రతి అడుగుకూ ప్రతికూలతే ఎదురవుతోంది. ఇప్పుడు బెంగుళూరు శిబిరంలో ఉన్నవాళ్లలో ఎందరు కాంగ్రెస్ పట్ల నిజమైన ప్రేమతోనే ఉన్నారో.. ఎందరు ఓటింగ్ నాటికి తమ ‘ఆత్మ ప్రబోధానుసారం’ వ్యవహరిస్తారన్నది కూడా డౌటే! వీటన్నిటినీ గమనిస్తే.. అహ్మద్ ఎన్నికవిషయంలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని పలువురు భావిస్తున్నారు.


