నా గురించి ఎవరేమనుకున్నా ఫర్వాలేదు.. పెళ్లి ఇప్పుడే కాదు..
- 22 Views
- admin
- August 5, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం సినిమా

అనుష్కతో బంధం గురించి వస్తున్న వార్తల్ని ఈ సందర్భంగా ప్రభాస్ ఖండించారు. ‘ఇలాంటి కథలు(వార్తలు) సాధారణం. నేను కూడా దీన్ని వూహించా. ఒక్క నటితో రెండు కన్నా ఎక్కువ చిత్రాల్లో నటిస్తే.. ప్రజలు ఇలాంటి రూమర్లను ప్రచారం చేయడం మొదలుపెడుతారు. ఇప్పుడు నాకిది కొత్తగా అనిపించడం లేదు. మొదట్లో నేనూ కొంత బాధపడేవాడ్ని. ‘ఇలాంటివి ఎలా రాస్తారు?’ అనుకునేవాడ్ని. కానీ ఇప్పుడు.. ఈ వార్తలు నన్ను ఏమాత్రం బాధించడం లేదు. తప్పుడు ప్రచారాలతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని ఆయన తెలిపారు.
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు.
Categories

Recent Posts

