అప్పన్నకు ఘనంగా కరాల చందన సమర్పణ.. అప్పన్నకు ఘనంగా కరాల చందన సమర్పణ
- 28 Views
- admin
- August 7, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
సింహాచలం, ఫీచర్స్ ఇండియా: శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీ వరాహలక్ష్మీ నసింహస్వామివారికి వైదిక సంప్రదాయప్రకారం కరాల చందన సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. వేకువజామున స్వామికి సుప్రభాతసేవ, ఆరాధన జరిపిన అనంతరం నాదస్వర మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు మ్రోగుతుండగా స్వామికి కరాలచందనాన్ని సమర్పించారు. ఐదు కేజీల పచ్చి చందనంలో సుగంధ ద్రవ్యాలు, కస్తూరి పసుపు, ముద్ద నామం మిళితం చేసి స్వామి మూలావిరాటును పరిపూర్ణ ఆకతిగా తీర్చిదిద్దారు. నేటి నుండి స్వామి నిండు చందనంలో భక్తులకు పరిపూర్ణంగా దర్శనమిస్తారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1గంట నుండి స్వామి వారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Categories

Recent Posts

