చంద్రబాబుకి రాఖీలు కట్టిన ‘తెలుగు’ చెల్లెళ్లు
- 22 Views
- admin
- August 7, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: రక్షా బంధన్ సందఠంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు చంద్రబాబుకు సోమవారం రాఖీలు కట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత, తెదేపా మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కష్ణా జిల్లాపరిషత్ ఛైర్మన్ గద్దె అనురాధ, కష్ణా జిల్లా తెదేపా మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత రాఖీలు కట్టి ఆయనకు మిఠాయి తినిపించారు.
అలాగే పర్యాటకాభివద్ధి సంస్థ ఛైర్మన్ సతీమణి రజనీ, బ్రహ్మకుమారీలు, తెలంగాణ తెదేపా నేతలు సీతక్క, దూలం రాధిక తదితరులు ఆయనకు రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు. ఈ సందఠంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదని సీఎం అన్నారు. మమతాను రాగాలకు, ప్రేమానుబంధాలకు రాఖీ పండుగ నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్ చేసేవారిపై, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపదలో ఉన్న మహిళల కోసం ‘అభయహస్తం’ యాప్ను రూపొందించినట్లు చెప్పారు. అలాగే రైతాంగానికి శ్రావణ పౌర్ణమి ఒక శుభ సమయమని చంద్రబాబు వెల్లడించారు.


