పాత కరెన్సీ నోట్ల ముఠా అరెస్టు .. రూ.1.90కోట్లు విలువైన పాత నోట్లు స్వాధీనం
- 22 Views
- admin
- August 7, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి గడువు ముగిసినప్పటికి రూ.1.90కోట్లు విలువైన పాతనోట్లకు, రూ.20లక్షలు అసలు నోట్లు ఇచ్చి కొనుగోలు చేసిన ఓ ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాయింట్ పోలీస్ కమిషనర్ డి.నాగేంద్ర మాట్లాడుతూ, బర్మాకేంప్కు చెందిన ఇ.కళ్యాణ్‌కుమార్, జి.వెంకటరమణ, మాధవధారకు చెందిన జె.నవీన్‌లు కలిసి అక్కయ్యపాలెం సమీపాన గల అబీద్నగర్కు చెందిన వేణుగోపాల అపార్ట్‌మెంట్‌కు సోమవారం ఉదయం వెళ్లారు. వీరు రూ.20లక్షలు కొత్త నోట్లు ఇచ్చి, రూ.1.90కోట్లు విలువైన రద్దయిన నోట్లు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసిపి చిట్టిబాబు ఈ ముఠాని పట్టుకుని, వారి నుండి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత జూన్ 31వ తేదీ వరకుా రద్దయిన నోట్లు మార్పిడి చేసేందుకు ఆర్బిఐ అవకాశం ఇచ్చిందని, అయితే ఎవరి దగ్గరైనా రద్దయిన నోట్లు పదికంటె ఎక్కువ వుంటే వారిని నేరస్థులుగా పరిగణమిస్తామన్నారు. ఈ సమావేశంలో క్రైం డిసిపి షెముషి భాజ్‌పాయ్, ఫోర్త్‌టౌన్ సిఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.


