కనకదుర్గమ్మ సేవలో గవర్నర్
- 19 Views
- admin
- August 9, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దుర్గగుడి అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు గవర్నర్కు ఆశీర్వచనాలు, దుర్గగుడి ఈవో సూర్యకుమారి తీర్థప్రసాదాలు అందించారు.