డిప్యూటీ కలెక్టర్ సింధు.. సీసీఎల్ఎలో బాధ్యతల స్వీకరణ
- 19 Views
- admin
- August 9, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న ఏపీ భూపరిపాలన (సీసీఎల్ఏ) కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సింధు ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ పునేఠాకు లేఖను అందజేశారు. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు.
Categories

Recent Posts

