బాసర ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
- 14 Views
- admin
- August 9, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

అసలేం జరిగిందంటే..
శ్రావణమాస మొదటి శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండలో అక్షరాభ్యాసాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్ ఆలయంలోపూజ సామగ్రి స్టోర్ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగి సుశీల నుంచి ఉత్సవమూర్తిని తీసుకున్నారు. అనంతరం విగ్రహం కనిపించకుండా పోయింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పూజాధికాల కోసమేనని భావించి తాను
ఉత్సవమూర్తిని సంజీవ్‌కుమార్‌కు అప్పగించినట్టు సుశీల అధికారులకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అక్షరాభ్యాస పూజల అనంతరం సంజీవ్‌కుమార్ తిరిగి ఉత్సవమూర్తిని తనకు అప్పగించేందుకు ప్రయత్నించారని, తాను దాన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో పాటు..ఆ విషయాన్ని ఆలయ పర్యవేక్షకుడు గిరిధర్ దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్నారు. ప్రధానార్చకుడు ఉత్సవ మూర్తిని ఆలయ దక్షిణభాగం నుంచి తన వాహన డిక్కీలో ఉంచి దేవరకొండకు తీసుకెళ్లినట్టు ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. వీరి వాదన ఇలా ఉండగా..ప్రధానార్చకుడు మాత్రం విగ్రహం తన వద్ద లేదని చెబుతుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. అర్చకుని బీరువా సీజ్: ఉత్సవమూర్తి ఎక్కడుందన్న విషయమై ఆరా తీసేందుకు ఆలయ పర్యవేక్షకుడు గిరిధర్ సోమవారం మధ్యాహ్నం సంజీవ్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించగా..ఉత్సవమూర్తి తన వద్ద లేదని ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం. సాయంత్రం నుంచి ఆయన ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. మంగళవారం ఆలయాధికారులు విగ్రహ ఆచూకీ తెలుసుకునే క్రమంలో ప్రధానార్చకుని ఇంటివద్దకు సిబ్బందిని పంపగా ప్రధానార్చకుని కుటుంబసభ్యులు ఆయన ఇంట్లో లేరంటూ సమాధానమిచ్చారు.
ఉత్సవమూర్తిని ఆయన ఆలయంలో తనకు కేటాయించిన బీరువాలో దాచి ఉంటాడని అనుమానిస్తున్న అధికారులు మంగళవారం దాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు ఉత్సవమూర్తి ఆచూకీ తెలియకపోగా..ఎవరికి వారు భిన్న వాదనలు విన్పిస్తుండటంతో ఉద్దేశ పూర్వకంగానే విగ్రహాన్ని మాయం చేసి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Categories

Recent Posts

