”మెడికల్ సెంటర్, బ్యాంకు” నిబంధనలకు విరుద్ధం.. యలమంచిలి ‘సౌభాగ్యరెసిడెన్సీ’ వివాదంలో హకోర్టు ఉత్తర్వులు
- 15 Views
- admin
- August 9, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
8 వారాల్లో చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: కాసులకు కక్కుర్తిపడ్డ అవినీతి బిల్డర్ చేసిన అకృత్యాలు ఒక్కొక్కొటిగా బైటపడుతున్నాయి. బిల్డర్ చేసిన తప్పిదాలను సరిచేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. యలమంచిలి రైల్వేస్టేషన్ రోడ్డులో నిర్మించిన ‘సౌభాగ్యరెసిడెన్సీ’ బిల్డర్ దేవిసాయి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ విశాఖపై వారు చేసిన వ్యవహారాలకు వ్యతిరేకంగా ‘సౌభాగ్య రెసిడెన్సీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ హైకోర్టులో వేసిన రిట్‌కు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. నివాసప్రాంతంగా పేర్కొన్న భవన సముదాయంలో వ్యాపార పరమైన విజయా మెడికల్ సెంటర్, ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం చట్టవిరుద్దమని, వాటిపై 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై స్థానిక సౌభాగ్య రెసిడెన్సీ వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ అసోసియేషన్ తరపున రిట్ దాఖలు చేసిన లాయర్ ఎస్. విజయభాస్కర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ఇదే రెసిడెన్సీలో ఫ్లాట్ ఓనర్స్కు తెలీకుండా స్టిల్ట్ ఏరియాను మెడికల్ సెంటర్‌కు బిల్డర్ అమ్మేయడాన్నీ కూడా కోర్టు తప్పు పట్టిందని అసోసియేషన్ తరపున వాధించిన లాయర్ ఎస్.విజయభాస్కర్ తెలిపారు. నిబంధనల ప్రకారం బిల్డర్ ఇచ్చిన అగ్రిమపెంటు ప్రకారం బిల్డింగ్ పనిపూర్తయ్యేవరకు బిల్డర్ తాను నిర్మించే ప్లాట్‌లో ఆరు ప్లాట్లను మున్సిపాలిటీకి తనఖా పెట్టారు. అయితే తనఖాగా ఉన్న 6 ప్లాట్లను కూడా అమ్మేయడం మోసపూరితమని బిల్డింగ్ సైట్ ఓనర్ బసవరాజు పేర్కొన్నారు. తనఖాలో ఉన్న ప్లాట్లు అమ్మకానికి పెడితే మున్సిపాలిటీ ఎన్ఒసి ఎలా ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సభ్యులందరికీ చెందిన స్టిల్ట్ ఏరియా 3,500 చ.గ.లను విజయా మెడికల్ సెంటర్‌కి బిల్డర్ అమ్మేయడాన్ని కూడా కోర్టు తప్పు పట్టిందని దానికి కూడా మున్సిపాలిటీనే బాధ్యుడ్ని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం అపార్టుమెంట్ నిర్మాణం పూర్తయింతర్వాత అమ్మకం మొదలైతే బిల్డర్ తన ఉనికిని కోల్పోతాడు. ఆ సంగతి తుంగలోకి తొక్కి సౌభాగ్య రెసిడెన్సీ ప్లాట్ల అమ్మకాలు పూర్తయింతర్వాత కూడా స్టిల్ట్పై అధికారం ఉందని వేరొకరికి అమ్మేయడం చట్టవిరుద్దమని స్పష్టమైంది. ప్లానులో చూపించిన విధంగా నిర్మించి ఇవ్వాలి. ప్లాన్ ఎప్రూవల్ అయింతర్వాత మార్పులకు తావులేదు. అలా మార్చాలనుకుంటే ప్లాట్ ఓనర్స్ అందరూ ఒప్పుకుని సంతకాలు చేయవలసి ఉంటుంది. అవేవీ లేకండా బిల్డింగ్ ప్లాట్లు అమ్మేసిన తర్వాత కూడా తన పెత్తనానికి పాల్పడితే అవేవీ చెల్లనేరవని హైకోర్టు వెల్లడించింది.


