ఈయన రైతు పక్షపాతి, ఆయన హైటెక్ పక్షపాతి!!
- 25 Views
- admin
- August 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా
రైతుల్ని ఆకట్టుకుంటేనే ఎన్నికల్లో గెలుపు. అధికారం చేపట్టాలంటే రైతు బాంధవుడిగా ఉండాల్సిందే ఏ సీఎం అయినా. గడిచిన కాలంలో రాజకీయ పార్టీలు నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే ఈ పాఠం ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్కినట్టే లేదు. గతంలో తనని ఓడించింది రైతులే అని తెలిసీ మళ్లీ మళ్లీ రైతన్నను పెడచెవిన పెట్టేస్తున్నాడన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ, ఊరూరా తిరిగి రైతాంగానికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. అతడు ఏకంగా గోదారి నీటిని మేడ్చల్ చెరువుల్లోకి మళ్లించేందుకు రెడీ అయ్యారంటే.. ఎంత నమ్మకంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని లక్ష ఎకరాల పొలాల్ని పండించడమే ధ్యేయంగా కేసీఆర్ ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులపైనా అంతే పట్టుదలగా ఉన్నారు కేసీఆర్. అంతేకాదు .. ఇటీవల ఎకరా ఉన్న రైతుకు రూ.4000 చొప్పున ఇస్తున్నానంటూ ప్రకటించారు. ఐదెకరాల రైతుకు యేటేటా ఏకంగా రూ.20,000 అందుకునే సదుపాయం కలగబోతోంది.
అయితే ఏపీ సీఎం చంద్రబాబులో మాత్రం రైతుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ మిస్సయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతూ పొలాలు ఎండే పరిస్థితి ఏపీలో ఉందిప్పుడు. దీంతో రైతన్నలు వర్షాల రాకకోసం మబ్బుల్లోకి చూస్తున్నారు. ఓవైపు విత్తనాలు చల్లి వర్షం లేక ఈసురోమంటున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు ముందస్తు ఆలోచనే బాబుకు లేదు. అసలు నీటి వసతులే లేని సన్నివేశం ఉన్నా పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ఎంతసేపూ తన దష్టి హైటెక్ పద్ధతిలో రాజధాని ఎలా నిర్మించాలి. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా గెలవడం ఎలా? అన్నదానిపైనే దష్టి సారించినట్టు అనిపిస్తోంది. దానికంటే ప్రజా సంక్షేమానికి, రైతన్నల కోసం చంద్రబాబు ఏం చేస్తున్నాడు? అన్న ప్రశ్న పల్లె పల్లెనా వినిపిస్తోంది. హైటెక్ బాబు ఎప్పటికీ రైతు సంక్షేమం కోసం ఏదీ చేయరు. కనీసం పంట పండించే విత్తనాలు అయినా సరిగా అందేలా చేయడంలోనూ ఏపీ సర్కారు నిర్లక్ష్య ధోరణి పైనా రైతులు మాట్లాడుకోవడం చర్చకొచ్చింది. ఇక రైతు రుణాలు సైతం సకాలంలో అందేలా ఏపీ సర్కారు ఏం చేస్తోంది అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. కేసీఆర్‌లా రైతన్నలకు డబ్బు పంచాల్సిన అవసరమేం లేదు. కనీస మేలుకైనా ప్రయత్నిస్తే అది చాలు. వచ్చే ఎన్నికల్లో బాబుకు రైతన్నల నుంచి పోటు తప్పదన్న వాదనా వినవస్తోంది. ఇప్పటికైనా జాగ్రత్తపడి రైతన్నలకు ఏదో ఒకటి చేయాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.