19Y4NSiG8kkzwWjMD17euEaQ5PErpwxWk
- 23 Views
- admin
- August 12, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మధురవాడ, ఫీచర్స్ ఇండియా : స్వాతంత్య్రదినోత్సవాన్ని పురష్కరించుకుని మధురవాడలో ఏబివిపి ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండువేల మంది విద్యార్ధులు 1500మీటర్లు పొడవైన మువ్వన్నెల జెండాను చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జాతీయ పతకాన్ని పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధులు దేశభక్తిని చాటి చెప్పారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు ఏబివిపి నాయకులు తెలిపారు. కార్షెండ్ జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కొమ్మాది జంక్షన్ వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు నాయకుడు పిళ్లా వెంకటరావు, ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రోహిత్, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.
Categories

Recent Posts

