నవ్యాంధ్రను అగ్రస్థానంలో నిలబెడదాం.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
- 20 Views
- admin
- August 15, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
తిరుపతి, ఫీచర్స్ ఇండియా
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందఠంగా పోలీసుల గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమర్థంగా విధులు నిర్వహించిన పలువురు పోలీసుల అధికారులకు అవార్డులు, పుసర్కారాలు అందజేశారు.
ఈ సందఠంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఒకే పటంపైకి తీసుకొచ్చిన ఘనత వల్లభాయ్ పటేల్. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ఆయన్ని తలుచుకుంటే ఇప్పటికీ ఆవేశం వస్తోంది. జాతీయ పతాకానికి నాంది పలికిన పింగళి వెంకయ్య ఇక్కడివారే. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ విధానం లేదు. ఈ సారి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ వేడుకలు నిర్వహించడం గర్వకారణం. తిరుపతి నాకు జన్మనిస్తే.. వెంకటేశ్వరస్వామి పునర్జన్మ ఇచ్చారు. అలిపిరిలో జరిగిన దాడి నుంచి ఆయనే నన్ను కాపాడారు. ప్రజలకు మరింత కాలం సేవ చేసే అద ష్టాన్ని నాకు ప్రసాదించారు. ప్రజాస్వామ్య దేశంలో సామాన్యులు సైతం అత్యున్నత పదవులు అధిరోహించవచ్చు. ఎన్టీఆర్, మోదీ లాంటి వారే అందుకు ఉదాహరణ. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోదీ ఇప్పుడు ప్రపంచం మెచ్చే ప్రధాని అయ్యారు.’
‘రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మన రాష్ట్రంలో మానవ వనరులకు కొదవ లేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు మనందరం కషి చేయాలి’ అని పేర్కొన్నారు.


