ప్రగతి సాధనలో ఆంధ్రయూనివర్శిటి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విసి ఆచార్య నాగేశ్వరరావు
- 21 Views
- admin
- August 15, 2017
- Home Slider యువత రాష్ట్రీయం స్థానికం
ఆంధ్రయూనివర్శిటి, ఫీచర్స్ ఇండియా : స్వాతంత్య్ర స్ఫూర్తితో ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని, బోధన, పరిశోధన రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించిందని ఏయు విసి ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏయు గ్రౌండ్స్‌లో ఉత్సాహం, ఎంతో ఆనందంగా సాగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలలో నాగేశ్వరరావు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధికి ఎంతో మంది శాస్త్రవేత్తలను, సుశిక్షితులైన ఉద్యోగులను ఏయు అందించిందన్నారు. బోధన, పరిశోధన రంగాల్లో సమృద్ధిని సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. రక్షణ రంగ ఉద్యోగుల కోసం ఏయు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టిందని, వివిధ సంస్థలతో, విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల బాటలో ప్రతీ ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌వైస్ మార్షల్ ఎస్.ఎస్.శర్మ, రిజిష్ట్రార్ ప్రొఫెసర్ వి.ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ రామ్మోహనరావు, అవధాని, బాబు తదితరులు పాల్గొన్నారు.


