విశాఖపట్నం పోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- 16 Views
- admin
- August 15, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విశాఖపట్నం పోర్టు ట్రస్టు తన సి.ఐ.ఎస్.ఎఫ్. కమాండెంట్ గ్రౌండ్లో నిర్వహించింది. కైలాసపురంలోని సి.ఐ.ఎస్.ఎఫ్. గ్రౌండ్లో కనుల పండువుగా సాగిన వేడుకల్లో పోర్టు చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సి.ఐ.ఎస్.ఎఫ్. కమాండెంట్ జయప్రకాశ్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర సంబరాల్లో జవాన్లు అద్బుతమైన అంశాలను ప్రదర్శించారు. ఫిస్టల్, ఎస్.ఎల్.ఆర్., ఎ.కె.47 తుపాకులను వినియోగంపై మహిళ కమాండోల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కళ్లకు గంతలు కట్టుకుని శత్రువులను ఎదుర్కొనే విధానం, కాల్పుల్లో ఒక చేతికి గాయమైనా తుపాకిని వినియోగించడం వంటి వాటిని కమాండోలు ప్రదర్శించారు. ఆ తరువాత సి.ఐ.ఎస్.ఎఫ్. దళం తుపాకులను నిర్వహించిన అద్బుతమైన ప్రదర్శన సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. స్వాతంత్య్ర పోరాటంలోని కొన్ని ఘట్టాలతో పోర్టు స్కూల్ విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రదర్శన అనంతరం విద్యార్ధులతో కలసి పోర్టు చైర్మన్ ఛాయా చిత్రాలను తీసుకున్నారు. కార్యక్రమానికి ముందు ముఖ్య అతిధి ఎం.టి. కృష్ణబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జవాన్ల నుంచి గౌరవ వందాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ చైర్మన్ హరనాధరావు ప్రియ అతిధిగా పాల్గొన్నారు.


