వైద్య పర్యాటక హబ్‌గా అమరావతి: సీఎం
- 19 Views
- admin
- August 16, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: రానున్న రోజుల్లో అమరావతి వైద్య పర్యాటక హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం వద్ద రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 150 ఎకరాల్లో నిర్మించనున్న హెల్త్ మెడిసిటీకి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రిమోట్ కంట్రోల్ ద్వారా చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా వ్కెద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 20 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చాం. సంచార వ్కెద్యం కింద 200కి పైగా వాహనాలు ఏర్పాటుచేశాం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్ వంటి కార్యక్రమాలు చేపట్టాం’ అని తెలిపారు.
లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా 50 ఎకరాల్లో వెయ్యి పడకల ఆస్పత్రి, నర్సింగ్ స్కూల్, పారామెడిక్స్ శిక్షణా కేంద్రం నిర్మిస్తారు.