వార్డుల విభజన జీవోతో మహా నగరంలో రాజకీయ వేడి
- 15 Views
- admin
- August 17, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
హర్షం వ్యక్తం చేసిన తె.దే.పా.
స్వాగతించిన వైఎస్ఆర్ సీపీ
సై అన్న బీజేపీ
తటస్థంగా కాంగ్రెస్
ఎన్నికల నిర్వహించాలంటున్న వామపక్షాలు, లోక్సత్తా
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
విశాఖ మహా నగరంలో ప్రజాపాలనకు ప్రభుత్వం తొలి అడుగు వేయడంతో రాజకీయ పక్షాల్లో నూతనుత్సాహం మొదలయ్యింది. వార్డులను పునర్వ్యస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేయడంతో నగర రాజకీయాలు వేడెక్కాయి. అయిదేళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న మహా విశాఖ నగరానికి ప్రజా పాలన వచ్చేందుకు ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నగరాన్ని 81 వార్డులుగా విభజిస్తూ జీవీ విడుదల చేయడంపై రాజకీయ పార్టీల్లో హర్షం వ్యక్తమవుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వాగతించింది. భారతీయ జనతా పార్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇల్లు అలకగానే పండక కాదంటూ వ్యాఖ్యానించింది. వార్డుల విభజనతోనే సమస్యలు పరష్కారం కావు…సత్వరం ఎన్నికలు నిర్వహించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, లోక్సత్తా ప్రభుత్వానికి సూచించాయి.
మహా నగరంలో విలీనమైన భీమునిపట్నం, అనకాపల్లితో కలపి విశాఖను 81 వార్డులుగా ప్రభుత్వం విభజించింది. జీవీఎంసీ పరిధిలో 17,30,320 మంది, అనకాపల్లిలో 86,612, భీమునిపట్నంలో 54,865 కోర్టుకు వెళ్లిన అయిదు పంచాయితీలలో 9889 మంది జనాభా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం ఈ విభజన చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. భీమిలిలో మొదలై తిరిగి భీమిలిలోనే వార్డుల విభజన పూర్తి అవుతుంది. ఈ లెక్కల ప్రస్తుతం ఉన్న వార్డుల స్వరూపం మారిపోతుంది. ఇందులో జనాభా, కులాలు, ఇతర అంశాల ప్రాతిపదికన వార్డులను ఖరారు చేస్తారు. భీమిలి, అనకాపల్లి విలీనం, పునర్వ్యీస్థీకరణ అనంతరం నిర్వహిస్తున్న తొలి ఎన్నికల కావడంతో అన్ని రాజకీయ పార్టీలలో భయం పట్టుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. మహా నగరంలో అధికార టీడీపీకి ఏడుగురు శాసనసభ్యులు, ఇరువురు ఎం.పీ.లు, మరో నలుగురు శాసనమండలి సభ్యులు ఉన్నారు. ఒక వేళ మేయర్ పరోక్ష ఎన్నిక అయితే ఈ ఓట్లు టీడీపీ అభ్యర్ధికే పోలవుతాయి. ఈ లెక్కన కేవలం 30 వార్డుల్లో విజయం సాధిస్తే టీడీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. బీజేపీతో పొత్తు ఎలానూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా 42 వార్డుల్లో గెలిస్తేనే మేయర్ దక్కుతుంది. లేదంటే ప్రతిపక్షానికే పరిమితమవుతుంది. శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ మహా ఎన్నికల్లో బోణి చేయవచ్చునని అనుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉన్నారు. విశాఖ నగరంలో వామ పక్ష పార్టీలకు చాలా కాలంగా స్థానం ఉంది. ఆ లెక్కను కొన్ని వార్డులో సీపీఐ., సీపిఎం పార్టీలు గెల్చుకునే అవకాశం ఉంది. లోక్సత్తా తన జాతకాన్ని పరీక్షించుకుంటుంది.
విశాఖ నగరానికి తొలి మేయర్గా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఎన్.ఎస్.ఎన్. రెడ్డి మేయర్గా నూతన శకానికి నాంది పలికారు. తరువాత తెలుగుదేశం పార్టీ వసమయ్యింది. డి.వి.సుబ్బారావు మేయర్గా పాలన అందించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. సబ్బం హరి పాలన కొనసాగింది. ఇలా మూడు సార్లు మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నాల్గవసారి కూడా కాంగ్రెస్ వసమయ్యింది. రాజాన రమణి మేయర్గా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2005లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. పులుసు జనార్ధన రెడ్డి మేయర్ అయ్యారు. 1981, 1987, 1995, 2000, 2007 సంవత్సరాలలో ఎన్నికలు అయ్యాయి. మధ్యలో కొని నెలలు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2005లో విశాఖపట్టణానికి గ్రేటర్ హోదా లభించింది. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలను విలీనం చేశారు. అంత వరకు ఉన్న 50 వార్డులను 71కి పెంచారు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి, భీమిలి ప్రాంతాలను విలీనం చేసి వార్డుల సంఖ్య 81కి పెంచారు.
ఈ పరిణామాల పట్ల రాజకీయ పార్టీలో దూకుడుగానే ఉన్నాయి. ఇంతకాలం పదవులకు దూరంగా ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో రాజకీయలతో నగరం వేడెక్కింది.


