నంద్యాలకు చంద్రబాబు.. అఖిలప్రియది మరో దారి
- 23 Views
- admin
- August 18, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
కర్నూలు, ఫీచర్స్ ఇండియా: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల పర్య టనకు వెళ్లనున్నారు. ఉప ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల్లోనే మకాం పెట్టారు. నంద్యాల ప్రచారానికి నాలుగు రోజుల గడువు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పాటు నంద్యాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి బాబు నంద్యాల్లో ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. చంద్రబాబు శనివారం ఉదయం నంద్యాలకు చేరుకుంటా రని, వివిధ బహిరంగ సభల్లో, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొంటారని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తెలిపారు. రోడ్ షో కూడా ఉం టుందని వారు ప్రకటించారు. శనివారం రాత్రి బాబు నంద్యాల్లోనే బస చేస్తారని, ఆదివారం రోజున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ఆదివారం మధ్యాహ్నంతో చంద్రబాబు నంద్యాల పర్యటన ముగుస్తుందని తెలిపారు. సోమవారంతో నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది.
ప్రస్తుతం నంద్యాల్లో ప్రచార హోరు కొనసాగుతోంది. ఇంకా చేరికలు, కండువాలు మార్చుకోవడాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఈయన నంద్యాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
అఖిలప్రియది మరో దారి
ఒకవైపు గంగుల ప్రతాపరెడ్డి చేరికతో నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ అవకాశాలు మెరుగవుతాయని.. ఆ పార్టీ నేతలు, అభిమానులు చెబుతుంటే, మంత్రి అఖిలప్రియ మాత్రం మరోలా మాట్లాడారు. ప్రతాపరెడ్డి చేరిక వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదని అఖిల తేల్చేయడం గమనార్హం. ఆ మాజీ ఎంపీ చేరికతో అదుÄతాేలు ఏమీ జరగవని అఖిల విశ్లేషించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున అంతా తానై పనిచేస్తున్న అఖిల ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది.
మాజీ ఎంపీ చేరిక వల్ల తమ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని తెలుగుదేశం నేతలు చెబుతున్న వేళ అఖిలప్రియ మాత్రం ‘అబ్బే.. ఆయన వల్ల అదనపు ఉపయోగం ఏమీ లేదు..’ అని తేల్చి చెప్పారు. మరి పార్టీలోకి చేరి వచ్చిన నేత పట్ల అఖిల ఇలా ఎందుకు మాట్లాడిందో వేరే వివరించనక్కర్లేదు. గంగుల కుటుంబంతో భూమా కుటుంబానికి ఆది నుంచి రాజకీయ వైరుధ్యాలున్నాయి. గంగుల కుటుంబం కాంగ్రెస్ లో ఉంటే, భూమా కుటుంబం తెలుగుదేశంలో పని చేసింది.
భూమా కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే.. గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. భూమా కుటుంబం టీడీపీలోకి వెళ్లగానే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లోనే మిగిలిపోయిన గంగుల ప్రతాపరెడ్డి ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరారు. దీంతో..భూమా కుటుంబీకులు అసహనంతో కనిపిస్తున్నారు. ఈ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ప్రతాపరెడ్డి చేరితో ప్రయోజనం లేదని మంత్రి అఖిల తేల్చి చెప్పారు.
అంతే కాదు.. ప్రతాపరెడ్డి చేరిక వల్ల టీడీపీలో తమ అనుచర వర్గానికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారామె. కానీ ఎవరు చేరినా, తన అనుచర వర్గాన్ని తను కాపాడుకుంటానని అఖిల విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఈ రాజకీయం ఆసక్తిదాయకంగా ఉంది.