పోలీసులకు సెలవులు..శాంతిభధ్రతల పరిరక్షణ, నేరాల అదుపు ఎలా?
- 20 Views
- admin
- August 18, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా : పోలీసు వ్యవస్థ ఏర్పడిన తరువాత ఇంత వరకూ పోలీసులకు అధికారికంగా వారంతపు సెలవులు లేకపోవడం ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి. పోలీసు విధులు, విధానాలు గురించి పోలీసు మాన్యువల్లో పొందుపరిచినప్పటికి పోలీసులకు కనీసం వారానికి ఒక్కరోజు సెలవు కూడా లేకపోవడంతో వారెంతో సతమతమవుతున్నారు. మారుతున్న పరిస్థితులు, కంప్యూటర్ వ్యవస్థీకరణ, డ్రోన్లతో నిఘా, నిఘా నేత్రాలు వంటి ఆధునిక పరిజ్ఞానం ఏర్పడటంతో, దశాబ్దాల కాలం నుండి పోలీసులు ఎదురు చూస్తున్న వారంతపు సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికి పెరుగుతున్న ఆధునిక పరిజ్ఞానానికి ధీటుగా శాంతి భధ్రతల ఉల్లంఘన అందుకు తగ్గ నేర ప్రవృత్తి కలిగిన ముఠాలు తయారవుతున్న సంగతి తెలిసిందే. జిల్లా కమిషనరేట్ పరిధిలో సుమారు 4వేల మందికి వారాంతపు సెలవులు ఇవ్వాల్సి వుంది. ఈ నేపధ్యంలో సెలవులు తీసుకున్న సిబ్బంది విధుల్లో అదనపు విధులు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా వున్నారా? అన్నది అధికారులకు మరో ప్రశ్నగా తయారైంది. ఇప్పటికే పోలీసు శాఖలో సిఫ్ట్ విధానంలో విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. శాంతిభధ్రతలు అలాగే నేర నియంత్రణకు అహర్నిశలు పోలీసులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో సెలవులు కేటాయించడంతో శాంతి భధ్రతల పరిరక్షణ, నేరాల అదుపుపై పోలీసు ఉన్నాతిధికారులు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. అంతేకాక ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి అయితే రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు పర్యాయాలు, నిర్ణయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించవలసి వుంటుంది. అలాగే రాత్రివేళల్లో బీట్ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది, రాత్రి 9నుండి ఉదయం 9గంటల వరకూ విధులు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పోలీసులకు ఏ విధంగా అధికారులు సెలవులు నిర్ణయిస్తారో వేచి చూడాల్సిందే.


