విశాఖ: విశాఖ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే అక్కసుతో యువతి ప్రాణం తీశాడు ఓ యువకుడు. విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తగరపువలసకు చెందిన హరిసంతోష్ (20) అనే యువకుడు రూప అనే (17) ఏళ్ల యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఈ రోజు మధ్యాహ్నం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఆమె సోదరుడు ఉపేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఉపేంద్రను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. యువతిపై కిరోసిన్ పోసి నిప్పటించిన తర్వాత హరి సంతోష్అక్కడి నుంచి పరారై విజయనగరం జిల్లా గోకపేట వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.