జిల్లా పోలీసు క్రీడల్లో ఓవరాల్ చాంపియన్ అనకాపల్లి డివిజన్
- 13 Views
- admin
- August 21, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: విశాఖపట్నం జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2017 గత మూడు రోజులుగా కైలాసాగిరి పోలీసు క్రీడా మైదానంలో గేమ్స్ మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు జరిగాయి. జిల్లాలో నాలుగు సబ్ డివిజన్లు అయిన అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు మరియు చింతపల్లి సంబంధించిన సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది మరియు మినిస్టీరియల్ సిబ్బంది మొత్తం150 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్గా అనకాపల్లి సబ్ డివిజన్ జట్టు టీంకెప్టెన్ ఎస్.సూర్యప్రకాష్, ఎస్.ఐ., కోచ్ ఎస్.వి.రామకష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జట్టు విజయం సాధించింది.
మినిస్టీరియల్ విభాగంలో ఎస్.పి. సి.సి. ఎమ్.వి.శ్రీనివాస్ 100 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ ప్లేస్, షటీల్ బాడ్మింటన్ లో సింగిల్స్ ఫస్ట్ మరియు డబుల్స్ విభాగంలో బి.శ్రీనివాసరావుతో కలసి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఎస్.పి.మేడమ్ శ్రీమతి సాక్షిశర్మ, ఓ.ఎస్.డి.మేడమ్ మేఘాకార్యాల్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జీ. శ్రీకాంత్, అదనపు ఎస్.పీ.(పరిపాలనా), సిద్దార్థ కౌషల్ ఐ.పీ.ఎస్. ఓ.ఎస్.డి.విశాఖపట్నం జిల్లా,
అనిల్ ప్రసాద్ కమాండెంట్ సి.ఆర్.పి.ఎఫ్., అనిల్ పులపాటి డి.ఎస్.పి. చింతపల్లి, కె.వి.రమణ డి.ఎస్.పి.,అనకాపల్లి,
ఎన్.ఎస్.ఎస్.శేఖర్ డీ.ఎస్.పీ.అర్మేడ్ రిసర్వ్, రిసర్వ్ ఇన్స్పెక్టర్స్ బీ. గౌరీశ్వరరావు, పీ. నాగేశ్వరావు, ఎన్.వి. రమణ, పీ బీ. సుబ్రమణ్యం, పి.ఎన్.కేదార్ ఏ.ఓ. డి.పి.ఓ. మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


