దేశంలోనే వెంకయ్య అద్భుతమైన వక్త: కేసీఆర్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం
- 16 Views
- admin
- August 21, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా
ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడుకు సన్మానం చేయడం తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందఠంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున వెంకయ్యకు సీఎం హ దయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ వెంకయ్య అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించడం గొప్పగా ఉందన్నారు. అందుకు మనందరం గర్వించాలి అని అన్నారు సీఎం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవం దక్కిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశంలోనే వెంకయ్య అద్భుతమైన వక్త అని కొనియాడారు. తన మాటలతో వెంకయ్య అందరిని అబ్బురపరుస్తారు. ఉపన్యాసాన్ని పండించడంలో వెంకయ్యనాయుడు దిట్ట అని ప్రశంసించారు. వ్యంగ్యం, హాస్యం, రౌద్రం అన్నీ కలిస్తేనే పరిపూర?మైన ఉపన్యాసం అన్న కేసీఆర్.. ఇవన్నీ వెంకయ్య ఉపన్యాసంలో కనిపిస్తాయన్నారు. తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం తెలుగు భాషకే గర్వకారణమన్నారు కేసీఆర్. తెలుగు ఒక్కటే కాదు.. ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి వెంకయ్య అని తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నె తెస్తారన్నారు. సావెంకయ్య సాధారణమైన వ్యక్తి. సామాన్య కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ బేగంపేటలో వెంకయ్య తమను ఆప్యాయంగా పలుకరించడం సంతోషాన్నిచ్చిందన్నారు. తెలుగు వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యత వహించడం గర్వకారణమన్నారు కేసీఆర్.
హైదరాబాద్ ఒక మినీ భారత్ : వెంకయ్య నాయుడు
తెలంగాణ ప్రభుత్వం తనకు పౌరసన్మానం చేయడం గొప్పగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు వెంకయ్య. తాను పుట్టింది నెల్లూరు.. చదివింది విశాఖలో.. రాజకీయంగా పెరిగింది.. ఒదిగింది.. ఎదిగింది మాత్రం హైదరాబాద్ లోనే అని వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ తో తనకెంతో సంబంధం ఉందన్నారు. హైదరాబాద్ లో రాజకీయంగా ఎదిగానని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ ను ఒక మినీ భారత్ అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హైదరాబాద్ అంటే ఉత్తరాది వాళ్లకి దక్షిణాది.. దక్షిణాది వాళ్లకి ఉత్తరాది అని తెలిపారు వెంకయ్య. హైదరాబాద్ బిర్యానీ, హలీంకు ప్రత్యేకత ఉందన్నారు. తాను మంచి భోజనప్రియుడిని.. భాషా ప్రియుడిని అని పేర్కొన్నారు. తెలంగాణలో తాను పర్యటించని ప్రాంతం లేదు. అన్ని తాలుకాలు తిరిగాను. హైదరాబాద్ అన్న.. తెలంగాణ అన్న తనకెంతో ఇష్టమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఘనంగా పౌరసన్మానం జరిగింది. వెంకయ్యకు సీఎం కేసీఆర్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందఠంగా వేదపండితులు ఆశీర్వచనాలు పలికి.. వెంకయ్యను ఆశీర్వదించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
దేశానికి వెంకయ్యనాయుడు సేవలు అవసరం : గవర్నర్
ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడు సేవలు దేశప్రజలందరికీ అవసరమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రాజ్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా పౌరసన్మానం జరిగింది. ఈ సందఠంగా వెంకయ్యకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యను ఘనంగా సన్మానించుకోవడం తెలుగు వారందరికీ ఈ రోజు శుభదినమని తెలిపారు. ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం అందరూ అభినందించాల్సిన విషయమన్నారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అవడంపై గర్వపడుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకయ్య నాయుడుకు పౌరసన్మానం జరగడం గొప్పగా ఉందన్నారు. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్యనాయుడు సమర్థవంతంగా పని చేయగలరని గవర్నర్ పేర్కొన్నారు.
వెంకయ్యకు సన్మానం తెలంగాణ
గర్వించదగ్గ విషయం : దత్తాత్రేయ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రభుత్వం పౌరసన్మానం చేయడం తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పట్టణాభివ ద్ధి శాఖ మంత్రిగా 2020 నాటికి దేశ ప్రజలందరికీ సొంత ఇండ్లు ఉండాలనే పథకానికి వెంకయ్య శ్రీకారం చుట్టడం అదుÄతేమన్నారు. అనుక్షణం సమాజాభివద్ధికి పాటు పడిన వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నా.. సామాన్యులకు అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి వెంకయ్య అని బండారు దత్తాత్రేయ తెలిపారు.


