‘సూర్యగ్రహణ’ సందడి
- 21 Views
- admin
- August 21, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
వాషింగ్టన్ : శతాబ్దం తరువాత అమెరికాలో సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణ దశ్యాలను వీక్షించేందుకు ఆ దేశ వాసులు సిద్ధమయ్యారు. ఈ ఖగోళ అద్భుతాన్ని తిల కించేందుకు ఆమెరికాలోని పలు ప్రాంతాలకు మిలియన్ల కొద్ది ప్రజలు చేరుకుంటున్నారు. ఒక తీరంలో ప్రారంభమై మరో తీరంలో ముగియనున్న సూర్యగ్రహణాన్ని వీక్షించేం దుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. గ్రహ ణం కారణంగా యూఎస్‌లోని 14 రాష్ట్రాల మీదుగా 70 కి.మీ వెడల్పు ప్రాంతం చీకటి మయం కానుంది. ఒరెగాన్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం 9.05 నిమి షాలకు సూర్యగ్రహణం ప్రారంభం కానుంది. ఈ అదుÄ్బత దశ్యాలను తిలకించేందుకు తమ రాష్ట్రానికి మిలియన్ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని ఆ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రహణం సందర్భంగా పలు హోటళ్లలో ప్రత్యేక వంటకాలతో పర్యాట కులను ఆకట్టుకుంటున్నారు. సూర్యగ్రహణ చిత్రాలు ఉన్న టీషర్ట్లు, ప్రత్యేక కళ్లద్దాల అమ్మకాలతో వీధులన్నీ సందడిగా మారాయి. సూర్యగ్రహణం ముగియనున్న దక్షిణ కరోలి నా ప్రాంతానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడి హోటళ్లకు పర్యాటకుల తాకిడి పెరిగింది. చార్లెస్టన్ పర్యా టక శాఖ అధికారులు ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 14 రాష్ట్రాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం
ఏర్పడనుండగా ఇతర రాష్ట్రాల్లోని వాసులు పాక్షిక గ్రహణ దశ్యాలను వీక్షించనున్నారు. పని దినమైన సోమవారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుండటంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు గ్రహణ దశ్యాలను వీక్షించేందుకు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సూర్యగ్రహణం సందర్భంగా విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పలు ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయాణికులను విమానాల్లో తీసుకెళ్లి గ్రహణ దశ్యాలను దగ్గరగా చూపించేందుకు ఏర్పాట్లు చేశాయి. గ్రహణం దశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు నాసా ఆకాశంలోకి భారీ బెలూన్లను పంపింది.


