నంద్యాల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
- 17 Views
- admin
- August 22, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం

నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో 144 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. నియోజకవర్గం మొత్తం దాదాపు సమస్యాత్మకంగా ఉండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలు నంద్యాలకు చేరుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్‌క్యాస్టింగ్ సిబ్బంది సహా మొత్తం 10మంది విధులు నిర్వహించనున్నారు.