రంగంలోకి డీఎంకే నేత స్టాలిన్.. గవర్నర్తో శశికళ వర్గీయుల భేటీ
- 19 Views
- admin
- August 22, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు
గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో దినకరన్ గ్రూప్ 19 మంది ఎమ్మెల్యేలు భేటీ, టెన్షన్ టెన్షన్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ (ఇన్చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్తో భేటీ అయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా గవర్నర్ విద్యాసాగర్ రావ్కు ఫిర్యాదు చెయ్యడానికి టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వెళ్లారని తెలిసింది. దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్తో చర్చలు జరుపుతున్నారు. అవసరం అయితే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి టీటీవీ దినకరన్ సిద్దం అయ్యారని తెలిసింది. టీటీవీ దినకరన్ వర్గంలో సోమవారం వరకు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మంగళవారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ వర్గంలో చేరిపోవడంతో తమిళనాడు ప్రభుత్వంలో టెన్షన్ మొదలైయ్యింది.
తమిళనాట పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకటై 24 గంటలు గడవకుండానే, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తాము పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఉదయం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి విన్నవించగానే, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ రంగంలోకి దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. దినకరన్ కు చెందిన 19 మందితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఇప్పటికిప్పుడు బల ప్రదర్శన జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, పళనిస్వామిపై తమకు నమ్మకం లేదని, వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ ను కోరామని శశికళ వర్గం నేత థంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు.


