ఆలస్యం చేయొద్దు.. జగన్పై వెంటనే కేసు నమోదు చేయాలి: యనమల
- 14 Views
- admin
- August 23, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
అమరావతి, ఫీచర్స్ ఇండియా: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్పై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకష్ణుడు బుధవారం విజ్ఞప్తి చేశారు. రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలా జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టిందని, ఆయనపై కేసు నమోదు చేయాలని రెండు రోజుల క్రితం ఆదేశించిందని, కాబట్టి వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.
సీఈసీ ఆదేశాల నేపథ్యంలో వెంటనే జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. ఐపీసీ సెక్షన్ అంటే అదే అన్నారు. జగన్ క్రూరత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అర్థం చేసుకుందని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.
జగన్ లాంటి క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఎన్నికల పరిధి నుంచి బహిష్కరించాలని యనమల రామకష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్కు అనుమతివ్వడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలన్నారు. అరాచకులకు
అలాగే అరాచకులకు అవకాశం ఇవ్వవద్దని మరో మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి అరాచకవాదులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల క్రితమే సీఈసీ ఆదేశాలు కాగా, జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల సందఠంగా సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని సీఈసీ పేర్కొంది. జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను రెండు రోజుల క్రితమే జారీ చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని, ఉరి తీయాలని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.