‘డోక్లామ్’తో చైనా విలవిల!
- 17 Views
- admin
- August 23, 2017
- అంతర్జాతీయం తాజా వార్తలు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండో సారి ఎన్నిక కావాలని ఆశిస్తున్నారు. అక్టోబరులో జరిగే కమ్యూనిస్టు పార్టీ 19వ సమావేశాల్లో ఈ ఎన్నిక జరగనుంది. అదే సమయంలో డోక్లామ్ నుంచి చైనా సైన్యం వెనక్కు మళ్లితే జిన్‌పింగ్‌కు ఇబ్బందులు తప్పవు. ఒక వేళ ముందుకు వెళ్లి భారత్‌తో యుద్ధానికి సిద్ధపడితే అంతర్జాతీయంగా చైనాకు చెడ్డపేరు వస్తుంది. వన్‌బెల్ట్, వన్‌రోడ్ పేరుతో ప్రపంచంలో ప్రబలమైన ఆర్థికశక్తిగా ఎదగాలన్న చైనా ఆశయానికి ఇది భంగం కలిగించే అంశమే. ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఉన్న భారత్‌తో యుద్ధం సంభవిస్తే భారత్‌తో పాటు చైనా ఆర్థికవ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదముంది. వీటితో పాటు చైనాకు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతుగా అమెరికా, జపాన్‌లు రంగంలోకి దిగవచ్చు. అలా జరిగితే చైనాకు మరిన్ని సవాళ్లు తప్పవు.