నంద్యాలలో 80 శాతం పోలింగ్?
- 18 Views
- admin
- August 23, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
కర్నూలు, ఫీచర్స్ ఇండియా: నంద్యాల ఉప ఎన్నికలో 80 శాతం పోలింగ్ నమోదు కానుందా? అంటే.. అవుననే అంటున్నారు ఎన్నికల అధికారులు. నంద్యాల ఉప ఎన్నికలో గంట గంటకు పోలింగ్ శాతం భారీగా నమోదు అవుతుంది. ఈ ఉప ఎన్నికలో 80 శాతం ఓటింగ్ నమోదు కానుందని ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 39 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నందాల్య నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,858.
నంద్యాల నియోజవకర్గంలో.. 2004లో 65 శాతం పోలింగ్, 2009లో 69 శాతం, 2014లో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కనీసం 70 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. మరి 2017 ఉప ఎన్నికలో వీటన్నింటిని మించి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నంద్యాల టీడీపీదా? వైసీపీదా? అనే స్థాయిలో పోటీ ఉంది.


