రాజీనామా చేస్తానంటే.. మోదీ ఆగమన్నారు
- 19 Views
- admin
- August 23, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో గత శనివారం కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 23 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా అరియా ప్రాంతంలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనలతో మనస్తాపానికి గురైన సురేశ్ ప్రభు.. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘రైల్వే మంత్రిగా దాదాపు మూడేళ్ల కాలంలో.. రైల్వేల అభివృద్ధి కోసం చెమటోడ్చి కష్టపడ్డాను. ప్రధాని మోదీ నాయకత్వంలో దశాబ్దాల నాటి సమస్యలను కూడా పరిష్కరించగలిగాను. ఈ కాలంలో రైల్వే శాఖ కొత్త మైలురాళ్లను చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తు జరుగుతున్న రైల్వే ప్రమాదాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అవి నన్ను ఎంతగానో బాధపెడుతున్నాయి. అందుకే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. ప్రధాని మోదీని కలిశాను. అయితే మోదీ నన్ను కొంతకాలం వేచి ఉండమని చెప్పారు’ అని ప్రభు తెలిపారు. ప్రభు ట్వీట్లపై నెటిజన్లు స్పందించారు. ‘మీలాంటి నిజాయతీ గల నాయకులు రాజీనామా చేయడం సరికాదు.. బాధ్యతల నుంచి వైదొలగద్దు’ అని కోరారు.


