ఏపీకి ఆనందీ బెన్, ఈశాన్యానికి మోత్కుపల్లి?
- 17 Views
- admin
- August 24, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా: కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్ గిరీకి సంబంధించిన కీలక సమాచారం లీకైంది. ఈసారి మంత్రి పదవులు సహా నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలనుందిట. ఇందులో భాగంగా గవర్నర్ పదవుల్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే తమిళనాడుకు, ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్ గిరీ అవసరం.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణా గవర్నర్‌గా నియమితులు కానున్నారని, తమిళనాడు గవర్నర్‌గా సుష్మ స్వారాజ్కు ఛాన్సుందని తెలుస్తోంది. తెలంగాణ తేదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకి ఈసారి కచ్చితంగా గవర్నర్ అయ్యే ఛాన్సుందని సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా నియమితులవుతారని సమాచారం. కిరణ్ బేడీ స్థానంలో కొత్త గవర్నర్‌ని నియంమించి అదే పుదిచ్చేరి రాష్ట్రానికి మరో గవర్నర్ నినియమించాలని అమీత్ షా భావిస్తున్నారుట. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, బీహార్, పంజాబ్, అస్సాంలకు కొత్త గవర్నర్లు వస్తారని తెలుస్తోంది.
వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో సురేష్ ప్రభు పోర్ట్ పోలియోని మార్చే యోచనలో కేంద్రం ఉందని, సీనియర్ మంత్రి నిర్మలా సీతారాం, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్థానంలో కొత్త వాళ్లకు ఛాన్సులుంటాయని చెబుతున్నారు. అలాగే పర్యాటక మంత్రి దవే ఆకశ్మిక మరణం తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది. దానికి కొత్తవారిని ఎంపిక చేస్తారని సమాచారం. అమిత్ షా-మోదీల కసరత్తులో ఈ ఎంపికలన్నీ దాదాపు పూర్తయ్యాయిని తెలుస్తోంది.