యలమంచిలి – గాజువాక బైపాస్రోడ్డుకి మహర్ధశ
- 16 Views
- admin
- August 24, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రూ.360 కోట్లతో నాలుగులైన్లుగా విస్తరణ
మరో మూడు నెలల్లో టెండర్లు
నోడల్ ఏజెన్సీగా పరిశ్రమలశాఖ
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: జిల్లాలో మరో ప్రధానరోడ్డు విస్తరణకు ఆసియా డెవలప్ బ్యాంకు సిద్ధపడింది. విశాఖ – చెన్నై కోస్టల్ కారిడార్ మార్గంలో కీలకమైన యలమంచిలి – గాజువాక, అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్లు నాలుగులైన్లుగా విస్తరించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఉపాధి కల్పన, పరిశ్రామిక ప్రగతి ధ్యేయంగా విస్తరించనున్న ఈ రోడ్లకు అవసరమైన ఋణ సదుపాయం కల్పించడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే డీపీఆర్లు సిద్ధం చేసి ఏడీపీకి పంపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం యలమంచిలి – గాజువాక రోడ్డుకు 36 కి.మీ.దూరానికి రూ.360 కోట్లు ఖర్చు కానుండగా, అచ్యుతాపురం-ఆనకాపల్లి రోడ్డు 13.78 కి.మీ.దూరానికి రూ.254 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే సిద్దం చేసిన ఈ రెండు రోడ్ల పనులు మరో మూడునెలల్లో మొదలు కానున్నాయని తెలిసింది. ఈ రోడ్ల ప్రధాన ఆశయం తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా రూపొందించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే నెలకొల్పుతున్న పరిశ్రమలకు అత్యంత ఆధునికమైన రోడ్లు అవసరం వుంది. ఇప్పటికే రద్ధీ పెరిగిన దృష్ట్యా 4 లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నారు. అవసరమైన చోట్ల కల్వర్టులు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టవలసి ఉండడంతో అంచనా వ్యయం భారీగానే పెరిగింది. సుమారు కి.మీ.రోడ్డుకు రూ.10 కోట్ల వ్యయం కానుంది. ఈ రెండు రోడ్లు విస్తరణ పూర్తయితే సెజ్ మార్గంలో తిరిగే వాహనాలకు కూడా మార్గం సగమం అవుతుంది. ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. యలమంచిలి ప్రాంత వాసులు విశాఖ వెళ్లాలంటే సమయం, దూరం కలిసొసొచ్చే ఈ మార్గం గుండానే ప్రయాణిస్తారని భావిస్తున్నారు.